ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా జరుగబోయే మూడో టెస్ట్‌లో వెటరన్ బౌలర్లు జిమ్మీ ఆండర్సన్, రవిచంద్రన్ అశ్విన్‌లు చారిత్రక మైలురాళ్లపై కన్నేశారు. వీరిద్దరు టెస్ట్ క్రికెట్‌లో అత్యంత అరుదైన మైలురాళ్లకు అతి చేరువలో ఉన్నారు. వీరిద్దరిలో అశ్విన్ ఇంకాస్త ముందున్నాడు.
రాజ్‌కోట్ టెస్ట్‌లో యాష్ (499) మరో వికెట్ తీస్తే, టెస్ట్‌ల్లో 500 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొమ్మిదో క్రికెటర్‌గా, రెండో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. యాష్‌కు ముందు అనిల్ కుంబ్లే (619 వికెట్లు) మాత్రమే భారత్ తరఫున ఈ ఘనత సాధించాడు.
ఆండర్సన్ విషయానికొస్తే.. మూడో టెస్ట్‌లో జిమ్మీ (695) మరో ఐదు వికెట్లు తీస్తే సుదీర్ఘ ఫార్మట్‌లో 700 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేవలం ఇద్దరు మాత్రమే ఈ అరుదైన మార్కును దాటారు. స్పిన్ దిగ్గజాలు ముత్తయ్య మురళీథరన్ (800), షేన్ వార్న్ మాత్రమే 700 వికెట్ల ఘనతను సాధించారు. ఆండర్సన్ ఈ మైలురాయిని చేరుకుంటే, ఈ ఘనత సాధించిన తొలి పేస్ బౌలర్‌గా, తొలి ఇంగ్లండ్ ప్లేయర్‌గా పలు రికార్డులు సాధిస్తాడు. మూడో టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 15న మొదలవుతుంది.
ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్ రెండు మ్యాచ్‌లు పూర్తయిన అనంతరం 1-1తో సమంగా ఉంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలువగా.. విశాఖలో జరిగిన సెకెండ్ టెస్ట్‌లో భారత్ విజయఢంకా మోగించింది.
Comments
Please login to add a commentAdd a comment