
ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్‌లో పాల్గొననున్నాడు. వాషింగ్టన్ ఫ్రీడం ఫ్రాంచైజీ స్టీవ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది జులై 4 నుంచి ప్రారంభంకాబోయే ఎంఎల్‌సీ రెండో సీజన్‌లో స్టీవ్ బరిలోకి దిగనున్నాడు. స్టీవ్ ఎంఎల్‌సీ అరంగేట్రం సీజన్‌లో ఇదే వాషింగ్టన్ ఫ్రీడంకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు.
𝐒𝐦𝐮𝐝𝐠𝐞 x 𝐅𝐫𝐞𝐞𝐝𝐨𝐦 = 😍
— Washington Freedom (@WSHFreedom) April 11, 2024
Welcome the the family, 𝐒𝐭𝐞𝐯𝐞 𝐒𝐦𝐢𝐭𝐡 ❤️#WashingtonFreedom #MLC2024 #SteveSmith pic.twitter.com/bGrzxlsr61
వాషింగ్టన్ ఫ్రీడంకు ఆసీస్ ఆటగాడు మోసెస్ హెన్రిక్స్ కెప్టెన్సీ వహిస్తుండగా.. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ జట్టులో హెన్రిక్స్‌తో పాటు మరో ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. తన్వీర్ సంగా, బెన్ డ్వార్షుయిస్, జోష్ ఫిలిప్ ఇదే ఫ్రాంచైజీకి ఆడుతున్నారు. వచ్చే సీజన్ నుంచి స్టీవ్ వీరితో జతకట్టనున్నాడు. ఎంఎల్‌సీ రెండో సీజన్ కోసం మరో ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లు వేర్వేరు ఫ్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్‌తో.. టిమ్ డేవిడ్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
కాగా, స్టీవ్ ఇటీవలికాలంలో పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అతను జాతీయ జట్టులో చోటు ఆశిస్తున్నప్పటికీ అవకాశాలు రావడం లేదు. లీగ్ క్రికెట్‌లో సైతం ఫ్రాంచైజీలు ఇతనికి ఆసక్తి చూపడం లేదు. ఐపీఎల్ 2024 సీజన్ వేలంలో స్టీవ్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. నిదానంగా బ్యాటింగ్ చేస్తాడనే కారణంగా ఏ ఫ్రాంచైజీ స్టీవ్‌ను సొంతం చేసుకోవడం లేదు. స్టీవ్ టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు ఆశిస్తున్నప్పటికీ అవకాశం లభించేలా లేదు. ఆసీస్ టాపార్డర్ బెర్తులు ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌లతో భర్తీ అయ్యాయి.