మేజర్ లీగ్ క్రికెట్‌లో (ఎంఎల్‌సీ) ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ ఎడిషన్‌లో వాషింగ్టన్ ఫ్రీడంకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న స్టీవ్.. తన శైలికి విరుద్దంగా భారీ షాట్లతో రెచ్చిపోతున్నాడు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన స్టీవ్.. 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేశాడు. స్టీవ్ ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లో నాటౌట్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేసిన స్టీవ్.. టెక్సస్ సూపర్ కింగ్స్‌తో నిన్న (జులై 8) రద్దైన మ్యాచ్‌లో 13 బంతుల్లో బౌండరీ, 3 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేశాడు.
Steven Smith loving the MLC. pic.twitter.com/k8CfprlXnQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 9, 2024
ఇదిలా ఉంటే, అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ గత సీజన్‌కు భిన్నంగా జోరుగా సాగుతుంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు కేవలం ఐదు మ్యాచ్‌లే జరగ్గా.. సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి.
వాషింగ్టన్ ఫ్రీడం, టెక్సస్ సూపర్ కింగ్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకకుండా ముగిసింది. ఈ మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ కెప్టెన్ డుప్లెసిస్ సెంచరీతో (58 బంతుల్లో 100; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు.
ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన వాషింగ్టన్ ఫ్రీడంకు వరుణుడు అడ్డుతగిలాడు. ఆ జట్టు తొలి నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసిన తరుణంలో వర్షం మొదలైంది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చి మ్యాచ్‌ను రద్దు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment