అగ్రరాజ్యం అమెరికా తొలిసారిగా నిర్వహిస్తున్న ఫ్రాంచైజీ టోర్నీ మేజర్ లీగ్ క్రికెట్‌కు సర్వం సిద్దమైంది. జూన్ 13న డల్లాస్ వేదికగా టెక్సాస్ సూపర్ కింగ్స్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ టోర్నీ షురూ కానుంది. కాగా ఐపీఎల్‌లోని నాలుగు ప్రధాన ప్రాంఛైజీలు ఎంఎల్‌సీలో జట్లను సొంతం చేసుకున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ లు ఎంఎల్‌సీలో ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. న్యూయార్క్ ఫ్రాంచైజీని దక్కించుకోగా.. సీఎస్కే మాదిరిగానే ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్.. టెక్సాస్ టీమ్ ను కొనుగోలు చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ లాస్ ఏంజెల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయగా ఢిల్లీ క్యాపిటల్స్:.. సియాటెల్ ను దక్కించుకుంది.
లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ కెప్టెన్‌గా సునీల్ నరైన్
ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్‌గా వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ ఎంపికయ్యాడు. ఐపీఎల్‌లో కేకేఆర్‌కు గత కొన్ని సీజన్లగా నరైన్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా కరీబియన్ ప్రీమియర్ లీగ్, యూఏఈ టీ20 లీగ్‌లో కేకేఆర్ సొంతం చేసుకున్న ప్రాంఛైజీల తరపున నరైన్ ఆడుతున్నాడు.
యూఏఈ టీ20 లీగ్‌లో అబుదాబి నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా కూడా నరైన్ కొనసాగుతున్నాడు. అయితే అతడి సారథ్యంలోని నైట్‌రైడర్స్ జట్టు నిరాశపరిచింది. అయినప్పటికీ అతడికి ఉన్న అనుభవం దృష్ట్యా మరోసారి జట్టు పగ్గాలు కేకేఆర్ మెనెజ్‌మెంట్ అప్పగించింది. లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ జట్టులో అతడితో పాటు లాకీ ఫెర్గూసన్, జాసన్ రాయ్ ,ఆండ్రీ రస్సెల్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు.
చదవండి: IND vs IRE: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. టీమిండియాలోకి ఎవరూ ఊహించని ఆటగాడు!
Comments
Please login to add a commentAdd a comment