మేజర్ లీగ్ క్రికెట్-2024లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం చర్చ్ స్ట్రీట్ పార్క్ వేదికగా వాష్టింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్ విధ్వంసం సృష్టించాడు.
ప్రత్యర్ధి బౌలర్లను డుప్లెసిస్ ఊచకోత కోశాడు. కేవలం 58 బంతుల్లోనే ఫాప్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. మేజర్ లీగ్ క్రికెట్‌లో డుప్లెసిస్‌కు ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం.
ఇక అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. అతడితో పాటు మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(39) పరుగులతో రాణించాడు. వాష్టింగ్టన్ బౌలర్లలో నేత్రవల్కర్ రెండు వికెట్లు పడగొట్టగా.. మార్కో జానెసన్, డిల్, హోస్సేన్ తలా వికెట్ సాధించారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వాష్టింగ్టన్‌కు ఓపెనర్ స్మిత్(26), హెడ్(36) మంచి ఆరంభాన్ని ఆంచారు. వీరిద్దరూ ధాటికి వాషింగ్టన్ 4 ఓవర్లలో 62 పరుగులు చేసింది. అయితే ఈ సమయంలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. వర్షం ఎప్పటికి తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్‌లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment