అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ తొలి ఎడిషన్‌లో ముంబై న్యూయార్క్ జట్టు ఫైనల్‌కు చేరింది. శనివారం టెక్సస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన ఛాలెంజర్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన ముంబై.. ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలో ఛేదించింది.
న్యూయర్క్ జట్టు లక్ష్య ఛేదనలో ఆ జట్టు యువ ఆటగాళ్లు డెవాల్డ్ బ్రెవిస్(41),జహంగీర్(36),టిమ్ డేవిడ్(33) కీలక పాత్ర పోషించారు. అంతకుముందు బౌల్ట్ నాలుగు వికెట్లతో చెలరేగడంతో టెక్సస్ సూపర్ కింగ్స్ 158 పరుగులకు ఆలౌటైంది. ఇక ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో సీటెల్ ఓర్కాస్,ముంబై న్యూయార్క్ జట్లు అమీ తుమీ తెల్చుకోనున్నాయి.
ముంబై ఆటగాడి భారీ సిక్సర్..
ఇక ఈ మ్యాచ్‌లో ముంబై న్యూయర్క్ ఓపెనర్ షాయన్ జహంగీర్ భారీ సిక్సర్ బాదాడు. అతడు కొట్టిన సిక్స్ మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. ముంబై ఇన్సింగ్స్ 5 ఓవర్‌లో 151 కి.మీ వేగంతో పేసర్ గెరాల్డ్ కోయెట్జీ వేసిన బంతిని.. జహంగీర్ అంతే వేగంతో 104 మీటర్ల భారీ సిక్స్‌గా మలిచాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా షాయన్ జహంగీర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో తన తొలి అంతర్జాతీయ సెంచరీని కూడా అందుకున్నాడు.
చదవండి: Rajinikanth On IPL SRH Team: ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్యా బాధను చూడలేకపోతున్నా: రజనీకాంత్
151 KMPH SENT PAST THE STANDS!
— Major League Cricket (@MLCricket) July 29, 2023
Shayan Jahangir hits a 104 METER SIX on Gerald Coetzee!
3⃣3⃣/1⃣ (4.5) pic.twitter.com/KscFvBcXXS
Comments
Please login to add a commentAdd a comment