పూరన్ ఊచకోత.. తొలి మ్యాచ్‌లో ముంబై టీమ్‌ ఘ‌న విజ‌యం | MLC 2024: Nicholas Pooran Powers MI New York To Six-Wicket Win Over Seattle Orcas | Sakshi
Sakshi News home page

MLC 2024: పూరన్ ఊచకోత.. తొలి మ్యాచ్‌లో ముంబై టీమ్‌ ఘ‌న విజ‌యం

Published Sat, Jul 6 2024 3:25 PM | Last Updated on Sat, Jul 6 2024 3:35 PM

MLC 2024: Nicholas Pooran Powers MI New York To Six-Wicket Win Over Seattle Orcas

మేజర్ లీగ్ క్రికెట్(MLC) 2024 సీజన్‌ను ఎంఐ న్యూయర్క్ ఘనంగా ఆరంభించింది. స్ట్రీట్ పార్క్ స్టేడియం వేదికగా  సీటెల్ ఓర్కాస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఎంఐ న్యూయర్క్ ఘన విజయం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ ఎంఐ బౌల‌ర్ల దాటికి కేవ‌లం 108 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. న్యూయర్క్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్, బౌల్డ్‌ చెరో మూడు వికెట్ల పడగొట్టి.. సీటెల్ ఓర్కాస్ పతనాన్ని శాసించారు.

 వీరితో పాటు పొలార్డ్‌ రెండు వికెట్లు, ఇషాన్‌ అదిల్‌, నోకియా తలా వికెట్‌ సాధించారు. సీటెల్‌ ఇన్నింగ్స్‌లో శుబమ్‌ రంజనే(35) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.

విధ్వంసం సృష్టించిన పూరన్‌..
ఇక 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఎంఐ న్యూయర్క్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 14.2 ఓవర్లలో ఊదిపడేసింది. ఎంఐ బ్యాటర్లలో నికోలస్‌ పూరన్‌ విధ్వంసం సృష్టించాడు. 

37 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 పరుగులు చేసిం ఆజేయంగా నిలిచాడు. సీటెల్‌ బౌలర్లలో గనూన్‌ రెండు వికెట్లు, బర్గర్‌, జహీర్‌ ఖాన్‌ తలా వికెట్‌ సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement