
Major League Cricket 2023- Seattle Orcas vs MI New York, Final: మేజర్ లీగ్ క్రికెట్-2023 ఫైనల్లో ఎంఐ న్యూయార్క్ బ్యాటర్ నికోలస్ పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చెమటలు పట్టించాడు. సీటెల్ ఓర్కాస్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు. వరుస బౌండరీలతో ఆకట్టుకున్నాడు. డల్లాస్‌లో జరిగిన లీగ్ తుదిపోరులో మొత్తంగా 55 బంతులు ఎదుర్కొన్న పూరన్ అజేయ సెంచరీ(137)తో మెరిశాడు.
పరుగుల సునామీ
ఏకంగా.. 249.09 స్ట్రైక్‌రేటుతో 10 ఫోర్లు, 13 సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ వెస్టిండీస్ బ్యాటర్ అద్భుత ఆట తీరు కారణంగా ముంబై ఇండియన్స్ జట్టు ఎంఐ న్యూయార్క్.. ఎంఎల్‌సీ(MLC) అరంగేట్ర ఎడిషన్ విజేతగా అవతరించింది. సీటెల్ ఓర్కాస్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి చాంపియన్‌గా నిలిచింది.
అయితే, నికోలస్ పూరన్ ఇన్నింగ్స్.. అతడి రికార్డులకు జమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే.. ఈ టీ20 లీగ్‌ను యూఎస్‌ఏ నిర్వహిస్తోంది. ఇక యూఎస్‌ఏ అసోసియేట్ మెంబర్ మాత్రమే అన్న సంగతి తెలిసిందే. కాబట్టి అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనల ప్రకారం.. మేజర్ క్రికెట్ లీగ్‌కు అధికారిక (టీ20) హోదా ఉండదు.
అయ్యో పాపం.. నామమాత్రం
ఈ నేపథ్యంలో నికోలస్ పూరన్ అజేయ అద్భుత శతకాన్ని ఓ మరుపురాని ఇన్నింగ్స్‌గా గుర్తుపెట్టుకోవడమే తప్ప.. అతడి రికార్డుల్లో దీనికి ఎటువంటి స్థానం ఉండదు. కాగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు భాగమైన ఎంఎల్‌సీలో మొత్తంగా ఆరు జట్లు ఉన్నాయి.
ఆరు జట్ల మధ్య పోటీ
జూలై 13న మొదలైన ఈ టీ20 లీగ్‌లో లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్, ఎంఐ న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో, సీటెల్ ఓర్కాస్, టెక్సాస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడం పేరిట ఆరు టీమ్‌లు పాల్గొన్నాయి. ఈ క్రమంలో జూలై 30 నాటి ఫైనల్లో ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ న్యూయార్క్ ఫైనల్లో సీటెల్‌ను ఓడించి తొలి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఎంఐ జట్టుకు.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నికోలస్ పూరన్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!
ᵗʰᵉ ᵒⁿˡʸ ᵗʰⁱⁿᵍ ᵍᵒⁱⁿᵍ ʳⁱᵍʰᵗ ᶠᵒʳ ˢᵉᵃᵗᵗˡᵉ
— Major League Cricket (@MLCricket) July 31, 2023
1⃣3⃣7⃣/3⃣ (12.2) pic.twitter.com/BZP6bYtwoa