Nicholas Pooran smashes three sixes in four balls to guide MINYs run chase - Sakshi
Sakshi News home page

MLC 2023: పూరన్‌ ఊచకోత.. 6 సిక్స్‌లు, 4 ఫోర్లతో! ముంబై ఘన విజయం

Published Mon, Jul 24 2023 10:03 AM | Last Updated on Mon, Jul 24 2023 10:36 AM

Pooran smashes three sixes in four balls to guide MINYs run chase  - Sakshi

అమెరికా వేదికగా జరగుతున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీలో ముంబై ఇండియన్స్‌ న్యూయర్క్‌ మరో విజయం తమ ఖాతాలో వేసుకుంది. అదివారం వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో న్యూయర్క్‌ విజయభేరి మోగించింది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై న్యూయర్క్‌ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలోనే ఛేదించింది.

న్యూయర్క్‌ విజయంలో ఆ జట్టు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్ది బౌలర్లను పూరన్‌ ఊచకోత కోశాడు. కేవలం 33 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 62 పరుగులు సాధిచి ఆజేయంగా నిలిచాడు. ముఖ్యంగా వాషింగ్టన్ బౌలర్‌ ఓబుస్ పియెనార్‌కు పూరన్‌ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్‌ 9 ఓవర్‌ వేసిన పియెనార్‌ బౌలింగ్‌లో పూరన్‌ ఏకంగా 22 పరుగులు రాబట్టాడు.

అందులో 3 సిక్స్‌లు, ఒక ఫోర్‌ ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.  అతడితో పాటు ముంబై ఓపెనర్‌ మునాక్‌ పటేల్‌(44) పరుగులతో రాణించాడు. ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. వాషింగ్టన్‌ బ్యాటర్లలో ఫిలిప్స్‌(47) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండిIND vs WI: ఇషాన్‌ కిషన్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌.. ధోని 17 ఏళ్ల రికార్డు బద్దలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement