మేజర్ లీగ్ క్రికెట్-2023లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తొలి ఓటమి చవిచూసింది. ఆదివారం వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో టెక్సాస్ సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది. 163 లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగల్గింది. సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో( 39 బంతుల్లో 76) మెరుపులు మెరిపించనప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు.
కెప్టెన్ డుప్లెసిస్, డెవాన్ కాన్వే వంటి టాపర్డర్ బ్యాటర్ల విఫలం కావడంతో 73 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి సూపర్ కింగ్స్ కష్టాల్లోపడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన బ్రావో ప్రత్యర్ది బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. ఆఖరి ఓవర్‌లో సూపర్ కింగ్స్ విజయానికి 27 పరుగులు అవసరమవ్వగా.. బ్రావో 20 పరుగులు రాబట్టాడు.
దీంతో 6 పరుగల తేడాతో సూపర్ కింగ్స్ ఓటమి చవిచూడల్సి వచ్చింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వాషింగ్టన్ ఫ్రీడమ్ ఇన్నింగ్స్‌లో మథ్యూ షార్ట్ 80 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ఆడాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ రెండు వికెట్లు సాధించగా.. బ్రావో, శాంట్నర్, మోహ్సిన్ తలా వికెట్ పడగొట్టారు.
బ్రావో సూపర్ సిక్సర్..
ఇక ఈ మ్యాచ్‌లో డ్వేన్ బ్రావో ఓ భారీ సిక్సర్ బాదాడు. ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన అన్రిచ్ నోర్జే బౌలింగ్‌లో.. బ్రావో 103 మీటర్ల భారీ సిక్స్ కొట్టాడు. నోర్జే షార్ట్‌పిచ్ డెలివరీ వేయగా.. బ్రావో లాంగ్ ఆన్ మీదుగా భారీ షాట్ ఆడాడు. బంతి కాస్త స్టేడియం బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Dwayne Bravo hits a 106 meter six in MLC!#MajorLeagueCricket pic.twitter.com/QJXjSoPDbb
— Abdullah Neaz (@Abdullah__Neaz) July 17, 2023
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌కు వెళ్లనున్న అజిత్ అగర్కార్.. ఎందుకంటే?
Comments
Please login to add a commentAdd a comment