అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ తొలి ఎడిషన్‌లో సీటిల్ ఓర్కాస్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, లీగ్‌లో అజేయ జట్టుగా నిలిచింది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో సీటిల్ ఆర్కాస్ జట్టు.. శాన్‌ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌పై 35 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్కాస్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీతో రఫ్ఫాడించగా.. హెట్‌మైర్ (36 నాటౌట్), నౌమన్ అన్వర్ (30), జయసూర్య (33) రాణించారు. యునికార్న్స్ బౌలర్లలో ప్లంకెట్ 2 వికెట్లు పడగొట్టగా.. హరీస్ రౌఫ్, కోరె ఆండర్సన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యునికార్న్స్.. కెమరూన్ గ్యానన్ (4/23), ఆండ్రూ టై (2/27), ఇమాద్ వసీం (2/24), హర్మీత్ సింగ్ (1/15) చెలరేగడంతో 17.5 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది.
యునికార్న్స్ ఇన్నింగ్స్‌లో షాదాబ్ ఖాన్ (37) టాప్ స్కోరర్ కాగా.. మాథ్యూ వేడ్ (28), ఫిన్ అలెన్ (28), మార్కస్ స్టోయినిస్ (15), ఆరోన్ ఫించ్ (14), కోరె ఆండర్సన్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో డికాక్, క్లాసెన్‌లు కలిసి ఏకంగా 7 క్యాచ్‌లు పట్టడం విశేషం. లీగ్‌లో రేపు జరుగబోయే తదుపరి మ్యాచ్‌లో లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్.. ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్లు తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment