
మేజర్ లీగ్ క్రికెట్‌లో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ ఏకంగా 105 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నైట్ రైడర్స్ కేవలం 50 పరుగులకే కుప్పకూలింది. న్యూయర్క్ బౌలర్లలో నోస్తుష్ కెంజిగే, ట్రెంట్ బౌల్ట్, రబాడ, అదిల్, పొలార్డ్ తలా రెండు వికెట్లు సాధించి ముంబై న్యూయర్క్ పతానాన్ని శాసించారు.
లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ బ్యాటర్లలో ఉన్ముక్త్ చంద్(26) మినహా మిగితా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. నాలుగు బ్యాటర్లు ఏకంగా డకౌటయ్యారు. ఇది నైట్ రైడర్స్‌కు వరుసగా రెండో ఓటమి కావడం గమానార్హం. కాగా లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ జట్టును ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం కొనుగొలు చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో టిమ్ డేవిడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్న డేవిడ్ 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్ పూరన్(38) రాణించాడు. ఇక నైట్ రైడర్స్ బౌలర్లలో డ్రై, అలీ ఖాన్, జంపా చెరో రెండు వికెట్లు సాధించారు.
చదవండి: MLC 2023: ఇదేమి సిక్స్‌రా బాబు.. ఏకంగా స్టేడియం బయటకు! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment