ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగం కానున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2024 సీజన్‌లో ఆడేందుకు శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ ఫ్రాంచైజీతో కమ్మిన్స్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను రన్నరప్‌గా నిలిపిన కమ్మిన్స్‌కు.. ఈ ఏడాది ఎంఎల్‌సీ(MLC) సీజన్‌లో శాన్ ఫ్రాన్సిస్కో జట్టు పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉంది.
గత సీజన్‌లో శాన్ ఫ్రాన్సిస్కోకు సారథ్యం వహించిన ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్ అనంతరం.. ఆ జట్టు కెప్టెన్సీ పదవి ఇంకా ఖాళీగానే ఉంది. ఈ క్రమంలోనే కమ్మిన్స్‌తో శాన్ ఫ్రాన్సిస్కో ఫ్రాంచైజీ కమ్మిన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
కమ్మిన్స్‌కు కెప్టెన్‌గా అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. తన సారథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియాకు కమ్మిన్స్ వరుసగా డబ్ల్యూటీసీ, వన్డే వరల్డ్‌కప్ టైటిల్స్‌ను అందించాడు. ఈ క్రమంలోనే లీగ్ క్రికెట్‌లో పలు ఫ్రాంచైజీలు అతడికి పగ్గాలు అప్పగించేందుకు క్యూ కడుతున్నాయి.
ఇక ఈ ఏడాది మేజర్ లీగ్ క్రికెట్‌లో ఇప్పటికే చాలా మంది ఆసీస్ ఆటగాళ్లు ఆయా ఫ్రాంచైజీలతో ఒప్పందం కుదర్చుకున్నారు. ట్రావిస్ హెడ్, మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, తన్వీర్ సంగా, మోసస్ హెన్రిక్స్ , బెన్ డ్వార్షుయిస్, జోష్ ఫిలిప్ లాంటి ఆసీస్ ఆటగాళ్లు వాషింగ్టన్ ఫ్రీడం ఫ్రాంచైజీతో తరపున ఆడనున్నారు.
అదే విధంగా ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్‌కు.. టిమ్ డేవిడ్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌కు ప్రాతినిథ్యం వహించనున్నారు. జూలై 2 నుంచి ఎంఎల్‌సీ సెకెండ్ సీజన్ ప్రారంభం కానుంది.
చదవండి: టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేసేందుకు నేను రెడీ: గంభీర్
Comments
Please login to add a commentAdd a comment