
Pak Vs NZ 2023 Revised Schedule: పాకిస్తాన్- న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల సిరీస్ షెడ్యూల్‌లో మార్పు చోటుచేసుకుంది. కివీస్‌తో స్వదేశంలో ఏప్రిల్ 14 నుంచి మే 7 వరకు టీ20, వన్డే సిరీస్ నిర్వహించనున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తాజా ప్రకటనలో తెలిపింది. ఇందుకు సంబంధించి సోమవారం రివైజ్డ్ షెడ్యూల్ విడుదల చేసింది.
కాగా 5 టీ20 మ్యాచ్‌లు, 5 వన్డేలు ఆడేందుకు న్యూజిలాండ్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో తొలుత ఏప్రిల్ 13-23 వరకు టీ20, ఏప్రిల్ 26- మే 7 వరకు వన్డే సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, తాజాగా టీ20 సిరీస్ ఒకరోజు ఆలస్యంగా మొదలుకానుండగా.. వన్డే సిరీస్ యథావిథిగా ఏప్రిల్ 26న ఆరంభం కానుంది.అయితే, రెండు, మూడు, నాలుగో వన్డేల తేదీల్లో మార్పు చోటుచేసుకుంది.
ఈ విషయాన్ని ధ్రువీకరించిన పీసీబీ.. ‘‘న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ మరోసారి పర్యటనకు రానుండటం ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానానికి చేరుకునేందుకు దోహదం చేస్తుంది. ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్-2023కి ముందు వన్డే సిరీస్ ఆడటం మెగా టోర్నీలకు సన్నాహకంగా ఉపయోగపడుతుంది. అదే విధంగా టీ20 సిరీస్ ద్వారా.. ప్రపంచకప్ సమరానికి ముందు పటిష్ట జట్టుతో ఆడనుండటం కలిసి వస్తుంది’’ అని ప్రకటనలో పేర్కొంది.
న్యూజిలాండ్ పాకిస్తాన్ పర్యటన.. పరిమిత ఓవర్ల సిరీస్ రివైజ్డ్ షెడ్యూల్
టీ20 సిరీస్
►మొదటి టీ20- ఏప్రిల్ 14 లాహోర్
►రెండో టీ20- ఏప్రిల్ 15- లాహోర్
►మూడో టీ20- ఏప్రిల్ 17- లాహోర్
►నాలుగో టీ20- ఏప్రిల్ 20- రావల్పిండి
►ఐదో టీ20- ఏప్రిల్ 24- రావల్పిండి
వన్డే సిరీస్
►మొదటి వన్డే- ఏప్రిల్ 26- రావల్పిండి
►రెండో వన్డే- ఏప్రిల్ 30- కరాచి
►మూడో వన్డే- మే 3- కరాచి
►నాలుగో వన్డే- మే 5- కరాచి
►ఐదో వన్డే- మే 7- కరాచి