న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌.. పాకిస్తాన్‌కు బిగ్‌ షాక్‌!? | Pakistan mystery spinner Abrar Ahmed to miss NZ T20Is now | Sakshi
Sakshi News home page

PAK vs NZ: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌.. పాకిస్తాన్‌కు బిగ్‌ షాక్‌!?

Jan 7 2024 8:41 AM | Updated on Jan 7 2024 10:42 AM

Pakistan mystery spinner Abrar Ahmed to miss NZ T20Is now - Sakshi

అబ్రార్ అహ్మద్

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో చిత్తు అయిన పాకిస్తాన్‌కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. అహ్మద్‌ ప్రస్తుతం తుంటి గాయంతో బాధపడుతున్నాడు. భారత్‌ వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా అహ్మద్‌ గాయపడ్డాడు.

అయినప్పటికి అతడిని ఆస్ట్రేలియా పర్యటనకు పాకిస్తాన్‌ జట్టు మేనెజ్‌మెంట్‌ తీసుకు వెళ్లింది. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా అహ్మద్‌ ఆడలేదు. అయితే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ సమయానికి అతడు కోలుకుంటాడని సెలెక్టర్లు భావించారు. ఈ క్రమంలో కివీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన  జట్టులో సెలక్టర్లు అహ్మద్‌కు చోటు కల్పించారు.

కానీ అతడు కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కివీస్‌తో సిరీస్‌కు కూడా అతడు దూరం కావడం దాదాపు ఖాయమైంది. కాగా అతడి స్ధానాన్ని ఇక న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్‌ ఆతిథ్య జట్టుతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో తలపడనుంది. జనవరి 12న ఆక్లాండ్‌ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. 

న్యూజిలాండ్‌తో టీ20లకు పాక్‌ జట్టు: షాహీన్ షా ఆఫ్రిది (కెప్టెన్), అమీర్ జమాల్, అబ్బాస్ అఫ్రిది, ఆజం ఖాన్ (వికెట్ కీపర్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, హారీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్-కీపర్), ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌-కీపర్), మహ్మద్ వసీం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఉసామా మీర్ మరియు జమాన్ ఖాన్.
చదవండి: #Shweta Sehrawat: 242 పరుగులతో విధ్వంసం.. 31 ఫోర్లు, 7 సిక్స్‌లు! ఎవరీ సెహ్రావత్?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement