Abrar Ahmed
-
విండీస్‌తో టెస్టులకు పాక్ జట్టు ప్రకటన.. అన్క్యాప్డ్ ప్లేయర్‌కు చోటు
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన టీమ్ వివరాలను శనివారం వెల్లడించింది. ఇటీవల సౌతాఫ్రికాలో పర్యటించిన టెస్టు జట్టులో ఏకంగా ఏడు మార్పులు చేసి.. ట్విస్ట్ ఇచ్చింది. ఇమామ్-ఉల్- హక్(Imam-ul-Haq) రీఎంట్రీతో పాటు మరెన్నో ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకుంది.అబ్దుల్లా షఫీక్‌పై వేటు వేసిన సెలక్టర్లు.. ఇమామ్‌కు పిలుపునిచ్చారు. కాగా ఇమామ్ ఇటీవల దేశవాళీ క్రికెట్లో అదరగొట్టాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 635 పరుగులు చేశాడు. ఇందులో రెండు భారీ సెంచరీలు(184, 160) ఉన్నాయి. దీంతో సూపర్ ఫామ్‌లో ఉన్న ఇమామ్ ఉల్ హక్కు సెలక్టర్లు పిలుపునివ్వడం గమనార్హం.విండీస్‌తో సిరీస్‌కు పూర్తిగా దూరంఇదిలా ఉంటే.. మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్(Abrar Ahmed) కూడా తిరిగి రాగా.. షాహిన్ ఆఫ్రి(Shaheen Afridi)ది మాత్రం ఈ జట్టులో లేడు. పని భారాన్ని తగ్గించే క్రమంలో మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది.అదే విధంగా.. నసీం షా, ఆమిర్ జమాల్, మీర్ హంజాలను కూడా సెలక్టర్లు రెస్ట్ పేరిట పక్కనపెట్టినట్లు సమాచారం. ఇక ఫామ్‌లో ఉన్న సయీమ్ ఆయుబ్ సౌతాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో అతడు విండీస్‌తో సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు.అన్క్యాప్డ్ ప్లేయర్‌కు చోటుఈ నేపథ్యంలో ఖుర్రం షాజాద్‌తో పాటు మహ్మద్ అలీ, అన్క్యాప్డ్ ప్లేయర్ కశిఫ్ అలీ పేస్‌దళ విభాగంలో చోటు దక్కించుకున్నారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో తమ చివరి సిరీస్‌లో పాకిస్తాన్ సొంతగడ్డపై వెస్టిండీస్‌తో తలపడుతోంది. ముల్తాన్ వేదికగా జనవరి 17-21 మధ్య తొలి టెస్టు, జనవరి 25-29 మధ్య రెండో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.అనంతరం న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో స్వదేశంలో పాకిస్తాన్ త్రైపాక్షిక వన్డే సిరీస్ ఆడనుంది. అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే.. ప్రధాన పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షాలకు టెస్టు జట్టు నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.సౌతాఫ్రికాలో పరాభవంఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. సెంచూరియన్, కేప్‌టౌన్ టెస్టుల్లో ఓడి 2-0తో క్వీన్‌స్వీప్‌నకు గురైంది. అంతకు ముందు టీ20 సిరీస్‌ను ప్రొటిస్ జట్టుకు చేజార్చుకున్న పాక్.. వన్డే సిరీస్‌ను మాత్రం 3-0తో వైట్‌వాష్ చేసింది. తద్వారా సౌతాఫ్రికా జట్టును తమ సొంతగడ్డపై వన్డేల్లో ఈ మేర క్లీన్‌స్వీప్ చేసిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు పాకిస్తాన్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఇమామ్-ఉల్-హక్, కమ్రాన్ గులామ్, కాశిఫ్ అలీ, ఖుర్రం షాజాద్, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్ బ్యాటర్), నొమన్ అలీ, రోహైల్ నజీర్ (వికెట్ కీపర్ బ్యాటర్), సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా.చదవండి: సిక్సర్లు బాదడంలో యువీ తర్వాత అతడే! -
అరంగేట్రంలోనే రికార్డుల్లోకెక్కిన పాక్ బౌలర్
పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ అరంగేట్రంలోనే (వన్డే) రికార్డుల్లోకెక్కాడు. అబ్రార్ తొలి మ్యాచ్‌లోనే తమ దేశ దిగ్గజ బౌలర్ అబ్దుల్ ఖాదిర్ సరసన చేరాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో (రెండో వన్డే) 4 వికెట్లు తీసిన అబ్రార్, అబ్దుల్ ఖాదిర్‌తో పాటు ఎలైట్ గ్రూప్‌లో చేరాడు. 1984లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో అబ్దుల్ ఖాదిర్ కూడా తన అరంగేట్రంలో 4 వికెట్లు తీశాడు. పాక్ తరఫున వన్డే అరంగేట్రంలో ఇవే అత్యధిక వికెట్లు. అబ్దుల్ ఖాదిర్, అబ్రార్ అహ్మద్‌తో పాటు జాకిర్ ఖాన్, సర్ఫరాజ్ నవాజ్ కూడా పాక్ తరఫున వన్డే అరంగేట్రంలో నాలుగు వికెట్లు తీశారు. కాగా, జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో పాక్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి వన్డేలో జింబాబ్వే చేతిలో అనూహ్య ఓటమిని ఎదుర్కొన్న పాక్, ఈ మ్యాచ్‌లో గెలుపొంది ప్రతీకారం తీర్చుకుంది. ఈ గెలుపుతో పాక్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది.విజృంభించిన అబ్రార్.. 145 పరుగులకే కుప్పకూలిన జింబాబ్వేఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 32.3 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. అబ్రార్ అహ్మద్ (8-2-33-4), అఘా సల్మాన్ (7-0-26-3), సైమ్ అయూబ్ (4-0-16-1), ఫైసల్ అక్రమ్ (5.3-0-19-1) జింబాబ్వే ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో డియాన్ మైర్స్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.53 బంతుల్లో శతక్కొటిన సైమ్ అయూబ్146 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 18.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఓపెనర్ సైమ్ అయూబ్ విధ్వంసకర సెంచరీతో పాక్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో అయూబ్ 53 బంతుల్లో శతక్కొట్టాడు. పాక్ తరఫున వన్డేల్లో ఇది మూడో ఫాస్టెస్ట్ సెంచరీ (జాయింట్). ఈ మ్యాచ్‌లో సైమ్ ఓవరాల్‌గా 62 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ 48 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే నవంబర్ 28న జరుగనుంది. -
Pak vs Ban: ఆలస్యమైతే అవుటే!.. పాక్ క్రికెటర్ చర్య వైరల్
పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు సందర్భంగా ఆసక్తికర ఘటన చేటుచేసుకుంది. పాక్ టెయిలెండర్ అబ్రార్ అహ్మద్ మైదానంలోకి పరిగెత్తుకు వచ్చిన తీరు బంగ్లా శిబిరంలో నవ్వులు పూయించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్ అబ్రార్ చర్యకు స్పందించిన తీరు హైలైట్‌గా నిలిచింది. అసలేం జరిగిందంటే..తొలి టెస్టులో ఘన విజయంరెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం పాకిస్తాన్ వెళ్లిన బంగ్లాదేశ్.. తొలి టెస్టులో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. పది వికెట్ల తేడాతో ఓడించి తొలిసారి పాక్‌పై టెస్టుల్లో విజయం సాధించింది. ఇదే జోరులో రెండో మ్యాచ్‌ను మొదలుపెట్టిన పర్యాటక జట్టు.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసి.. ఆ దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు పాక్‌ను ఆలౌట్ చేసిన బంగ్లాదేశ్.. రెండో ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే పరిమితం చేసింది.రెండో మ్యాచ్‌లోనూ అదరగొడుతూసోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా పేసర్లు హసన్ మహమూద్ ఐదు, నషీద్ రాణా నాలుగు వికెట్లతో చెలరేగి.. పాక్ బ్యాటింగ్ ఆర్డర్ వెన్నువిరిచారు. ఈ క్రమంలో.. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే క్రమంలో స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వేగంగా పరిగెత్తుకు వచ్చాడు. ఆ హడావుడిలో అతడి చేతి గ్లౌజ్ కిందపడగా.. వెంటనే దానిని తీసుకుని మరింత వేగంగా క్రీజు వైపునకు పరిగుతీశాడు.ఆలస్యమైతే అవుటే.. షకీబ్ నవ్వులుఆ సమయంలో బౌలింగ్ చేస్తున్నది మరెవరో కాదు బంగ్లా మాజీ కెప్టెన్ షకీబల్ హసన్. అబ్రార్ హడావుడికి అదే కారణం. ఏమాత్రం ఆలస్యం చేసినా టైమ్డ్ అవుట్ కింద అవుట్ అయ్యే ప్రమాదం ఉందని పసిగట్టిన అబ్రార్.. అలా పరిగెత్తగానే.. షకీబల్ నవ్వడం గమనార్హం. కాగా వన్డే ప్రపంచకప్-2023 సందర్భంగా శ్రీలంకతో మ్యాచ్ సమయంలో షకీబ్.. టైమ్డ్ అవుట్ కింద అప్పీలు చేసి ఏంజెలో మాథ్యూస్‌ను పెవిలియన్‌కు పంపిన విషయం తెలిసిందే.నాడు లంక బ్యాటర్‌కు చేదు అనుభవంఐసీసీ నిబంధనల ప్రకారం.. ఒక బ్యాటర్ అవుటైనా.. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినా అతడి స్థానంలో వచ్చే ఆటగాడు.. మూడు నిమిషాల్లోపే క్రీజులోకి వచ్చి తొలి బంతిని ఎదుర్కోవాలి. లేదంటే.. టైమ్డ్ అవుట్ రూల్ కింద అవుటైనట్లుగా ప్రకటిస్తారు. నాడు మాథ్యూస్ షకీబ్ కారణంగా ఇలా అవుటై.. ఈ చెత్త రికార్డు మూటగట్టుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అది దృష్టిలో పెట్టుకునే అబ్రార్ కూడా షకీబ్‌కు భయపడి ఉంటాడంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చదవండి: 'పాకిస్తాన్ జట్టుకు క్యాన్సర్.. ఆ నలుగురు చాలా డేంజరస్'unreal fear of abrar ahmed being get timed out when Shakib is bowling 😂Everyone remembered what happened with sir angelo Mathews 😜#PAKvBAN pic.twitter.com/bXiijoNBKb— Afrid Mahmud Rifat 🇧🇩 (@rifat0015) September 2, 2024 -
బంగ్లాతో రెండో టెస్టు.. పాక్ సంచలన స్పిన్నర్ ఎంట్రీ
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఘోర ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రెండో మ్యాచ్‌కు ముందు యువ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కమ్రాన్ గులాంను వెనక్కి పిలిపించింది. వీళ్లిద్దరిని తిరిగి జట్టులో చేర్చింది.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో భాగంగా పాకిస్తాన్ సొంతగడ్డపై బంగ్లాతో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా ఆగష్టు 21-25 మధ్య జరిగిన తొలి టెస్టులో అతి విశ్వాసంతో భారీ మూల్యం చెల్లించింది. పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేక కేవలం పేసర్లకు ప్రాధాన్యం ఇచ్చి.. చేజేతులా ఓటమిని ఆహ్వానించింది. వారిద్దరు తిరిగి జట్టులోకి బంగ్లాదేశ్ స్పిన్ వలలో చిక్కి 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తద్వారా బంగ్లా చేతిలో టెస్టు మ్యాచ్ ఓడిన పాక్ తొలి జట్టుగా షాన్ మసూద్ బృందం నిలిచింది. ఈ క్రమంలో రెండో టెస్టులో ఎలాగైనా విజయం సాధించి.. సిరీస్‌ను డ్రా చేసుకోవాలని పాక్ పట్టుదలగా ఉంది. ఇందులో భాగంగా.. ముందుగా చెప్పినట్లుగా అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులాంను తిరిగి జట్టులోకి తీసుకుంది. వీరిలో అబ్రార్‌కు తుదిజట్టులో చోటు దాదాపుగా ఖాయం కాగా.. కమ్రాన్ విషయంలో సందిగ్దం నెలకొంది. నాలుగు వికెట్లతో మెరిసిన అబ్రార్ఇక వీరితో పాటు ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిదిని కూడా వెనక్కి పిలిపించింది పాక్ బోర్డు. ఈ మేరకు.. ‘‘ఆగష్టు 30 నుంచి సెప్టెంబరు 3 వరకు రావల్పిండి క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగనున్న రెండో టెస్టు కోసం అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులాం తిరిగి జట్టుతో చేరుతున్నారు’’ అని పీసీబీ ప్రకటన విడుదల చేసింది. అదే విధంగా షాహిన్, ఆల్‌రౌండర్ ఆమీర్ జమాల్ కూడా జట్టుతోనే ఉండనున్నట్లు తెలిపింది.కాగా తొలి టెస్టుకు ముందు అబ్రార్‌తో పాటు కమ్రాన్‌ను విడుదల చేయగా.. బంగ్లాదేశ్-ఏ జట్టుతో పాక్ షాహిన్స్ జట్టు తరఫున అనధికారిక టెస్టు ఆడారు. ఈ మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ అబ్రార్ నాలుగు వికెట్లతో మెరవగా.. కమ్రాన్ 34 పరుగులు చేయడంతో పాటు.. ఆరు ఓవర్లపాటు బౌలింగ్ చేశాడు. కానీ వికెట్ తీయలేకపోయాడు. కాగా అబ్రార్ అహ్మద్ ఇప్పటి వరకు పాక్ తరఫున మొత్తంగా ఆడింది ఆరు టెస్టులే అయినా 38 వికెట్లు తీసి సత్తా చాటాడు.బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు పాకిస్తాన్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్ (ఫిట్నెస్ సాధిస్తేనే), అబ్రార్ అహ్మద్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, ఖుర్రం షెహజాద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీం షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ ఆఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), షాహిన్ షా ఆఫ్రిది.చదవండి: Test Rankings: దూసుకొచ్చిన బ్రూక్.. టాప్-10లో ముగ్గురు భారత స్టార్లు -
బంగ్లాతో తొలి టెస్టు.. పాక్ జట్టు నుంచి ఆ ఇద్దరు అవుట్
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు ఆరంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన జట్టు నుంచి ఇద్దరు ఆటగాళ్లను విడుదల చేసింది. బంగ్లాదేశ్-‘ఎ’ టీమ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడాల్సిందిగా ఆదేశించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో భాగంగా పాక్- బంగ్లా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగనుంది.ఈ రెండు టెస్టులు ఎందుకు కీలకం?రావల్పిండి వేదికగా ఆగష్టు 21- 25, కరాచీ వేదికగా ఆగష్టు 30- సెప్టెంబరు 3 వరకు మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో స్థానాన్ని మెరుగుపరచుకోవాలంటే సొంతగడ్డపై జరుగుతున్న ఈ సిరీస్ పాక్‌కు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది.ఈ నేపథ్యంలో తమ వ్యూహాల్లో భాగంగా బంగ్లాతో తొలి టెస్టులో కేవలం పేసర్లకు మాత్రమే తుదిజట్టులో చోటివ్వనుంది. ఈ క్రమంలో యువ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను జట్టు నుంచి రిలీజ్ చేసింది. పాకిస్తాన్ షాహిన్స్- బంగ్లాదేశ్-‘ఎ’ మధ్య ఆగష్టు 20న కరాచిలో మొదలుకానున్న నాలుగు రోజుల మ్యాచ్‌లో ఆడాల్సిందిగా ఆదేశించింది.అందుకే అతడిని రిలీజ్ చేశాంతద్వారా అతడికి కావాల్సినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించనుంది. ప్రధాన సిరీస్ తొలి టెస్టులో బెంచ్‌కే పరిమితం చేసే బదులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పాక్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. అబ్రార్ అహ్మద్‌తో పాటు టాపార్డర్ బ్యాటర్ కమ్రాన్ గులాంను రిలీజ్ చేశామని.. అతడు కూడా పాకిస్తాన్ షాహిన్స్ జట్టుతో చేరనున్నట్లు తెలిపింది.అంతేకాదు.. అతడే పాకిస్తాన్ షాహిన్స్ కెప్టెన్‌గానూ వ్యవహరిస్తాడని పీసీబీ పేర్కొంది. అయితే, అబ్రార్, కమ్రాన్ బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ముందు పాకిస్తాన్ ప్రధాన జట్టుతో చేరతారని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. మీర్ హంజా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, నసీం షా, సయీమ్ ఆయుబ్, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్ తదితరులు పాకిస్తాన్ షాహిన్స్(తొలి మ్యాచ్ తర్వాత)ను వీడి ఇప్పటికే బంగ్లాతో సిరీస్‌కు సన్నద్ధమవుతున్నారు.కాగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టీమిండియా టాప్‌లో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఈ టేబుల్లో టాప్-2లో నిలిచిన జట్లే ఫైనల్‌కు అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే.బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు పాకిస్తాన్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సయీమ్ ఆయుబ్, మహ్మద్ హురైరా, బాబర్ ఆజమ్, అబ్దుల్లా షఫీక్, అఘా సల్మాన్, సౌద్ షకీల్, ఆమెర్ జమాల్, మహ్మద్ రిజ్వాన్, సర్ఫరాజ్ అహ్మద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, నసీం షా, ఖుర్రమ్ షెహజాద్, షాహిన్ అఫ్రిది.బంగ్లాదేశ్- ‘ఎ’ జట్టు(రెండో మ్యాచ్)తో పోటీపడే పాకిస్తాన్ షాహిన్స్ టీమ్కమ్రాన్ గులాం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అలీ జర్యాబ్, గులాం ముదస్సర్, ఇమామ్ ఉల్ హక్, మెహ్రాన్ ముంతాజ్, మహ్మద్ అవైస్ అన్వర్, నియాజ్ ఖాన్, ఖాసిం అక్రమ్, రోహైల్ నజీర్ (వికెట్ కీపర్), సాద్ బేగ్ (వికెట్ కీపర్), సాద్ ఖాన్, షరూన్ సిరాజ్, ఉమర్ అమీన్. -
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్.. పాకిస్తాన్‌కు బిగ్ షాక్!?
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో చిత్తు అయిన పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. అహ్మద్ ప్రస్తుతం తుంటి గాయంతో బాధపడుతున్నాడు. భారత్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా అహ్మద్ గాయపడ్డాడు. అయినప్పటికి అతడిని ఆస్ట్రేలియా పర్యటనకు పాకిస్తాన్ జట్టు మేనెజ్మెంట్ తీసుకు వెళ్లింది. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా అహ్మద్ ఆడలేదు. అయితే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సమయానికి అతడు కోలుకుంటాడని సెలెక్టర్లు భావించారు. ఈ క్రమంలో కివీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో సెలక్టర్లు అహ్మద్‌కు చోటు కల్పించారు. కానీ అతడు కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కివీస్‌తో సిరీస్‌కు కూడా అతడు దూరం కావడం దాదాపు ఖాయమైంది. కాగా అతడి స్ధానాన్ని ఇక న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ ఆతిథ్య జట్టుతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో తలపడనుంది. జనవరి 12న ఆక్లాండ్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్‌తో టీ20లకు పాక్ జట్టు: షాహీన్ షా ఆఫ్రిది (కెప్టెన్), అమీర్ జమాల్, అబ్బాస్ అఫ్రిది, ఆజం ఖాన్ (వికెట్ కీపర్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, హారీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్-కీపర్), ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్-కీపర్), మహ్మద్ వసీం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఉసామా మీర్ మరియు జమాన్ ఖాన్. చదవండి: #Shweta Sehrawat: 242 పరుగులతో విధ్వంసం.. 31 ఫోర్లు, 7 సిక్స్‌లు! ఎవరీ సెహ్రావత్? -
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. పాకిస్తాన్‌కు బిగ్ షాక్
ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు ముందు పాకిస్తాన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్పిన్ యువ సంచలనం అబ్రార్ అహ్మద్ గాయం కారణంగా పెర్త్ వేదికగా జరగనున్న మొదటి టెస్టుకు దూరమయ్యాడు. కాగా కాన్బెర్రాలో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో అబ్రార్ అహ్మద్‌కు మోకాలి గాయమైంది. బంతిని ఆపే క్రమంలో అతడు గాయపడ్డాడు. నొప్పితో విల్లావిల్లాడిన అహ్మద్ మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. అతడి గాయం తీవ్రం కావడంతో మొదటి టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని పీసీబీ ఆదివారం దృవీకరించింది. ఇక అతడి స్ధానాన్ని ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్‌తో పాకిస్తాన్ క్రికెట్ భర్తీ చేసింది. సాజిద్ ఖాన్ ఒకట్రెండు రోజుల్లో ఆస్ట్రేలియాకు పయనం కానున్నాడు. డిసెంబర్ 14న పెర్త్ వేదికగా ఆసీస్-పాకిస్తాన్ తొలి టెస్టు ప్రారంభం కానుంది. వన్డే వరల్డ్‌కప్‌లో పేలవ ప్రదర్శన తర్వాత పాకిస్తాన్‌కు ఇదే తొలి మ్యాచ్. చదవండి: U19 Asia Cup 2023: చేతులెత్తేసిన బౌలర్లు.. పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమి -
నిప్పులు చెరిగిన నసీం షా.. తిప్పేసిన అబ్రార్.. కుప్పకూలిన శ్రీలంక
కొలొంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శ్రీలంకతో ఇవాళ (జులై 24) మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ పైచేయి సాధించింది. పేసర్లు నసీం షా (3/41), షాహీన్ అఫ్రిది (1/44) నిప్పులు చెరగగా.. స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (4/69) మాయాజాలం చేయడంలో పాక్ శ్రీలంకను తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూల్చింది. పాక్ ఆటగాడు మసూద్ అద్భుతంగా ఫీల్డింగ్ చేయడంతో ఇద్దరు లంక బ్యాటర్లు రనౌట్ రూపంలో వెనుదిరిగారు. ఓపెనర్ నిషాన్ మధుష్క (4), ప్రభాత్ జయసూర్యలను (1) మసూద్ రనౌట్ చేశాడు. పాక్ బౌలర్ల ధాటికి లంక ఆటగాళ్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టగా.. ధనంజయ డిసిల్వ (57) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. ఇతనితో పాటు కెప్టెన్ దిముత్ కరుణరత్నే (17), దినేశ్ చండీమల్ (34), రమేశ్ మెండిస్ (27) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిధ్య పాక్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సౌద్ షకీల్ (208 నాటౌట్, 30) చెలరేగిపోవడంతో పాక్ 4 వికెట్ల తేడాతో గెలపొందింది. ధనంజయ డిసిల్వ (122) సెంచరీతో కదం తొక్కడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేయగా.. సౌద్ షకీల్ రెచ్చిపోవడంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 461 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో 279 పరుగులకు ఆలౌటైతే.. పాక్ 6 వికెట్లు కోల్పోయి లంక నిర్ధేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇమామ్ ఉల్ హాక్ (50 నాటౌట్).. సౌద్ షకీల్ సాయంతో పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు. -
Pak Vs Eng: గూగ్లీతో స్టోక్స్ మతి పోగొట్టాడు! ‘వరుసగా’ 7 వికెట్లు.. వైరల్
Pakistan vs England, 2nd Test- Abrar Ahmed: పాకిస్తాన్ యువ సంచలనం అబ్రార్ అహ్మద్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. అరంగేట్రంలోనే వరుసగా ఏడు వికెట్లు పడగొట్టి క్రీడా వర్గాల దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ మేరకు ఈ యువ లెగ్ స్పిన్నర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆది నుంచే అతడే! ముల్తాన్ వేదికగా పాకిస్తాన్- ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం రెండో టెస్టు ఆరంభమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను ఆదిలోనే దెబ్బకొట్టాడు అబ్రార్. ఓపెనర్ జాక్ క్రాలేను 19 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. అయితే, ఆ తర్వాత బెన్ డకెట్(63), ఓలీ పోప్(60) పట్టుదలగా నిలబడ్డారు. అర్ధ శతకాలు పూర్తి చేసుకున్న వీరిని అవుట్ చేయడం అబ్రార్‌కు సాధ్యమైంది. డకెట్‌ను ఎల్బీడబ్ల్యూ చేసిన ఈ యువ స్పిన్నర్.. పోప్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. ఏడు వికెట్లు ఆ తర్వాత జో రూట్(8), హ్యారీ బ్రూక్ (9), కెప్టెన్ బెన్ స్టోక్స్(30) వికెట్లు కూల్చాడు. కాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో అబ్రార్ ఖాతాలో ఆఖరి వికెట్ విల్ జాక్స్(31). ఇలా మొత్తంగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో అబ్రార్ ఏడు వికెట్లు కూల్చగా.. అందులో మూడు ఎల్బీడబ్ల్యూలు ఉన్నాయి. అవాక్కైన స్టోక్స్ అయితే, వీటన్నింటిలో స్టోక్స్‌ను అబ్రార్ అవుట్ చేసిన విధానం ప్రత్యేంగా నిలిచింది. 43వ ఓవర్ రెండో బంతికి అద్భుతమైన గూగ్లీతో స్టోక్స్‌ను బౌల్డ్ చేశాడు. అబ్రార్ సంధించిన బంతిని డిఫెన్స్ ఆడే క్రమంలో స్టోక్స్ ముందుకు రాగా.. అతడి ప్రయత్నం ఫలించలేదు. బంతి నేరుగా వెళ్లి మిడిల్ స్టంప్‌ను ఎగురగొట్టింది. దీంతో అవాక్కవడం స్టోక్స్ వంతైంది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో.. 24 ఏళ్ల అబ్రార్ అహ్మద్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘‘స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్లకు పగలే చుక్కలు చూపించావు.. ఇప్పుడే మొదలైన నీ ప్రయాణం మరింత గొప్పగా ముందుకు సాగాలి’’ అని క్రికెట్ ఫ్యాన్స్ అతడికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. కాగా అబ్రార్ (144/7) సంచలన బౌలింగ్‌తో మెరవగా, జాహిద్ మహ్మద్ 3 వికెట్లు కూల్చాడు. దీంతో.. 51.4 ఓవర్లలో 281 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. జింబాబ్వే తరపున ఆడేందుకు! FIFA WC 2022: ఏం గుండెరా నీది.. చచ్చేంత సమస్య ఉన్నా దేశం కోసం బరిలోకి This. Is. Special. 🤯#PAKvENG | #UKSePK pic.twitter.com/ExgHlMfrxY — Pakistan Cricket (@TheRealPCB) December 9, 2022 -
పాకిస్తాన్ క్రికెట్లో మరో యువ సంచలనం.. అరంగేట్ర మ్యాచ్‌లోనే 7 వికెట్లు..
అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్. ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ యువ బౌలర్ మొదటి మ్యాచ్‌లోనే ప్రత్యర్థి జట్టుకు వణుకుపుట్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇంగ్లండ్ తొలి ఏడు వికెట్లను కూడా అబ్రార్ అహ్మద్ సాధించాడు. ఈ క్రమంలో ట్విటర్ వేదికగా అబ్రార్ అహ్మద్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక అబ్రార్ అహ్మద్ ఏడు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 281 పరుగులకు ఆలౌటైంది. అహ్మద్‌తో పాటు జహీద్ మహ్మద్ కూడా మూడు వికెట్లు సాధించాడు. కాగా మొత్తం పది వికెట్లను కూడా స్పిన్నర్లే పడగొట్టడం విశేషం. కాగా ఇంగ్లండ్ బ్యాటర్లలో డాకెట్ (63), ఓలీ పాప్(60) పరుగులతో రాణించారు. ఇక ఏడు వికెట్లతో చెలరేగిన అబ్రార్ అహ్మద్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. తొలి పాక్ బౌలర్‌గా టెస్టు అరంగేట్రం తొలి సెషన్లోనే ఐదు వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్‌గా అబ్రార్ అహ్మద్ నిలిచాడు. అదే విధంగా అరంగేట్ర టెస్టులో తొలి రోజు ఐదు వికెట్లు ఘనత సాధించిన రెండో పాక్ బౌలర్‌గా అహ్మద్ నిలిచాడు. అంతకుముందు పాక్ పేసర్ వహబ్ రియాజ్ తన డెబ్యూ టెస్టు మొదటి రోజులో ఈ ఘనత సాధించాడు. ఇక ఓవరాల్‌గా డెబ్యూ టెస్టులో ఐదు వికెట్ల హాల్ సాధించిన 13వ పాకిస్తాన్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. First morning as a Test debutant 🌟 Abrar Ahmed becomes the 13th Pakistan bowler to take a five-wicket haul on Test debut 💫#PAKvENG | #UKSePK pic.twitter.com/OE1qqtkPsN — Pakistan Cricket (@TheRealPCB) December 9, 2022 చదవండి: Ind Vs Ban 3rd ODI: జట్టులోకి కుల్దీప్ యాదవ్.. రోహిత్ గాయంపై బీసీసీఐ అప్డేట్