
పాకిస్తాన్ యువ సంచలనం అబ్రార్ అహ్మద్ (PC: PCB)
Pakistan vs England, 2nd Test- Abrar Ahmed: పాకిస్తాన్ యువ సంచలనం అబ్రార్ అహ్మద్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. అరంగేట్రంలోనే వరుసగా ఏడు వికెట్లు పడగొట్టి క్రీడా వర్గాల దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ మేరకు ఈ యువ లెగ్ స్పిన్నర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
ఆది నుంచే అతడే!
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్- ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం రెండో టెస్టు ఆరంభమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను ఆదిలోనే దెబ్బకొట్టాడు అబ్రార్. ఓపెనర్ జాక్ క్రాలేను 19 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు.
అయితే, ఆ తర్వాత బెన్ డకెట్(63), ఓలీ పోప్(60) పట్టుదలగా నిలబడ్డారు. అర్ధ శతకాలు పూర్తి చేసుకున్న వీరిని అవుట్ చేయడం అబ్రార్‌కు సాధ్యమైంది. డకెట్‌ను ఎల్బీడబ్ల్యూ చేసిన ఈ యువ స్పిన్నర్.. పోప్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు.
ఏడు వికెట్లు
ఆ తర్వాత జో రూట్(8), హ్యారీ బ్రూక్ (9), కెప్టెన్ బెన్ స్టోక్స్(30) వికెట్లు కూల్చాడు. కాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో అబ్రార్ ఖాతాలో ఆఖరి వికెట్ విల్ జాక్స్(31). ఇలా మొత్తంగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో అబ్రార్ ఏడు వికెట్లు కూల్చగా.. అందులో మూడు ఎల్బీడబ్ల్యూలు ఉన్నాయి.
అవాక్కైన స్టోక్స్
అయితే, వీటన్నింటిలో స్టోక్స్‌ను అబ్రార్ అవుట్ చేసిన విధానం ప్రత్యేంగా నిలిచింది. 43వ ఓవర్ రెండో బంతికి అద్భుతమైన గూగ్లీతో స్టోక్స్‌ను బౌల్డ్ చేశాడు. అబ్రార్ సంధించిన బంతిని డిఫెన్స్ ఆడే క్రమంలో స్టోక్స్ ముందుకు రాగా.. అతడి ప్రయత్నం ఫలించలేదు. బంతి నేరుగా వెళ్లి మిడిల్ స్టంప్‌ను ఎగురగొట్టింది. దీంతో అవాక్కవడం స్టోక్స్ వంతైంది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో.. 24 ఏళ్ల అబ్రార్ అహ్మద్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘‘స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్లకు పగలే చుక్కలు చూపించావు.. ఇప్పుడే మొదలైన నీ ప్రయాణం మరింత గొప్పగా ముందుకు సాగాలి’’ అని క్రికెట్ ఫ్యాన్స్ అతడికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. కాగా అబ్రార్ (144/7) సంచలన బౌలింగ్‌తో మెరవగా, జాహిద్ మహ్మద్ 3 వికెట్లు కూల్చాడు. దీంతో.. 51.4 ఓవర్లలో 281 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. జింబాబ్వే తరపున ఆడేందుకు!
FIFA WC 2022: ఏం గుండెరా నీది.. చచ్చేంత సమస్య ఉన్నా దేశం కోసం బరిలోకి
This. Is. Special. 🤯#PAKvENG | #UKSePK pic.twitter.com/ExgHlMfrxY
— Pakistan Cricket (@TheRealPCB) December 9, 2022