
ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు ముందు పాకిస్తాన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్పిన్ యువ సంచలనం అబ్రార్ అహ్మద్ గాయం కారణంగా పెర్త్ వేదికగా జరగనున్న మొదటి టెస్టుకు దూరమయ్యాడు. కాగా కాన్‌బెర్రాలో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో అబ్రార్ అహ్మద్‌కు మోకాలి గాయమైంది. బంతిని ఆపే క్రమంలో అతడు గాయపడ్డాడు.
నొప్పితో విల్లావిల్లాడిన అహ్మద్ మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. అతడి గాయం తీవ్రం కావడంతో మొదటి టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని పీసీబీ ఆదివారం దృవీకరించింది. ఇక అతడి స్ధానాన్ని ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్‌తో పాకిస్తాన్ క్రికెట్ భర్తీ చేసింది. సాజిద్ ఖాన్ ఒకట్రెండు రోజుల్లో ఆస్ట్రేలియాకు పయనం కానున్నాడు. డిసెంబర్ 14న పెర్త్ వేదికగా ఆసీస్-పాకిస్తాన్ తొలి టెస్టు ప్రారంభం కానుంది. వన్డే వరల్డ్‌కప్‌లో పేలవ ప్రదర్శన తర్వాత పాకిస్తాన్‌కు ఇదే తొలి మ్యాచ్.
చదవండి: U19 Asia Cup 2023: చేతులెత్తేసిన బౌలర్లు.. పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమి