లాహొర్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో 4 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో కివీస్ తొలి గెలుపు నమోదు చేసింది. 164 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. ఆఖరిలో ఇఫ్తికర్ ఆహ్మద్(23 బంతుల్లో 60) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. పాకిస్తాన్ విజయం సాధించలేకపోయింది.
చివరి ఓవర్‌లో పాక్ విజయానికి 15 పరుగులు అవసరమవ్వగా.. కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ బంతిని నీషమ్ చేతికి ఇచ్చాడు. తొలి బంతిని ఇఫ్తికర్ ఆహ్మద్ సిక్సర్‌గా మలచగా.. రెండో బంతికి ఎటువంటి రన్స్ రాలేదు. మూడో బంతికి ఇఫ్తికర్ ఫోర్ బాదాడు. అయితే దురదృష్టవశాత్తూ నాలుగో బంతికి ఇఫ్తికర్ ఔటయ్యాడు. దీంతో పాకిస్తాన్ ఓటమి ఖారారైంది.
న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ మూడు వికెట్లు పడగొట్టగా.. మిల్నే,రవీంద్ర తలా రెండు వికెట్లు సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్(64) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో హారీస్ రౌఫ్, అఫ్రిది తలా రెండు వికెట్లు సాధించగా.. షాదాబ్ ఖాన్ ఒక్క వికెట్ పడగొట్టాడు.
చదవండి: IPL 2023: తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ.. పదండి ఉప్పల్‌కి అంటూ! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment