స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. లాహొర్ వేదికగా కివీస్‌తో జరిగిన తొలి టీ20లో 88 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. పాక్ పేసర్ల ధాటికి 94 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో హారిస్ రౌఫ్ నాలుగు వికెట్లతో కివీస్ వెన్ను విరచగా.. ఇమాడ్ వసీం రెండు, అఫ్రిది, షాదాబ్ ఖాన్, జమాన్ ఖాన్, ఆష్రాఫ్ తలా వికెట్ సాధించారు.
న్యూజిలాండ్ బ్యాటర్లలో మార్క్ చాప్‌మాన్(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 182 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో అయాబ్(47), ఫఖర్ జమాన్(47) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు.
అతడితో పాటు మిల్నే, లిస్టర్ తలా రెండు వికెట్లు, సోధి, లిస్టర్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు ఇది 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం విశేషం. ఇక ఈ రెండు జట్ల రెండో టీ20 లాహొర్ వేదికగానే శనివారం జరగనుంది.
చదవండి: IPL 2023: ఈ చెత్త ఆటకే వాళ్లు వదిలేసింది.. ఇక్కడ కూడా అంతేనా? 8 కోట్లు దండగ
Comments
Please login to add a commentAdd a comment