బాబర్ సెంచరీ.. పాక్ ఘన విజయం
Pakistan vs New Zealand- Babar Azam: పాకిస్తాన్ గడ్డపై టీ20 సిరీస్‌లో రాణించిన న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. ఇప్పటికే మూడింట ఓటమిపాలై సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకున్న కివీస్.. నాలుగో వన్డేలోనూ భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.
5 టీ20లు, 5 వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడటానికి న్యూజిలాండ్ పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది. వన్డే వరల్డ్‌కప్-2023 ఈవెంట్‌కు ముందు సన్నాహకంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో కివీస్ వైఫల్యం కొనసాగిస్తోంది. కరాచీ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో టాస్ గెలిచి న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
సెంచరీతో చెలరేగిన బాబర్
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య పాకిస్తాన్‌కు ఓపెనర్ మసూద్(44) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ బాబర్ సెంచరీ(107)తో చెలరేగాడు. అతడికి తోడు.. ఐదో స్థానంలో వచ్చిన ఆగా సల్మాన్ అర్థ శతకం(58)తో రాణించాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 334 పరుగుల భారీ స్కోరు సాధించింది.
కెప్టెన్ ఒక్కడే ఈ మాత్రం
లక్ష్య ఛేదనకు దిగిన కివీస్‌ను ఉసామా మీర్ దెబ్బకొట్టాడు. 10 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చి కివీస్ పతనాన్ని శాసించాడు. హారిస్ రవూఫ్ రెండు, మహ్మద్ వసీం జూనియర్ మూడు, షాహిన్ ఆఫ్రిది ఒక్కో వికెట్ తీశారు. కివీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ టామ్ లాథమ్ 60 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
మిగతావాళ్లలో మార్క్ చాప్‌మన్ 46 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్ బ్యాటర్ డారిల్ మిచెల్ 34 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్ల ధాటికి మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో 43.4 ఓవర్లలో 232 పరుగులు మాత్రమే చేసి కివీస్ ఆలౌట్ అయింది. 102 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
12 ఏళ్ల తర్వాత తొలిసారి
సెంచరీ హీరో బాబర్ ఆజం ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. కాగా ఐపీఎల్-2023 సందర్భంగా గాయపడిన కివీస్ సారథి కేన్ విలియమ్సన్ జట్టుకు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక ఇప్పటికే 12 ఏళ్ల తర్వాత తొలిసారి పాక్‌కు వన్డే సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్.. ఆఖరి మ్యాచ్‌లో గనుక ఓడితే క్లీన్‌స్వీప్‌తో అపఖ్యాతిని మూటగట్టుకోకతప్పదు.
చదవండి: IPL 2023: కేఎల్ రాహుల్ అవుట్.. అతడి స్థానంలో కర్ణాటక బ్యాటర్
.@iShaheenAfridi gets the New Zealand skipper! \0/#PAKvNZ | #CricketMubarak pic.twitter.com/dE5C7ZmOOq
— Pakistan Cricket (@TheRealPCB) May 5, 2023
Comments
Please login to add a commentAdd a comment