Pak Vs NZ 1st ODI: Naseem Shines, Pakistan Beat New Zealand By 6 Wickets - Sakshi
Sakshi News home page

Pak Vs Nz 1st ODI: న్యూజిలాండ్‌పై పాక్‌ ఘన విజయం.. సిరీస్‌లో ముందంజ

Published Tue, Jan 10 2023 10:50 AM | Last Updated on Tue, Jan 10 2023 12:13 PM

Pak Vs NZ 1st ODI: Naseem Shines Pakistan Won By 6 Wickets Lead - Sakshi

Pakistan vs New Zealand, 1st ODI- Naseem Shah: న్యూజిలాండ్‌ జట్టుతో కరాచీలో జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్‌ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 256 పరుగుల విజయలక్ష్యాన్ని పాక్‌ 48.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మహ్మద్‌ రిజ్వాన్‌ (77 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (66; 5 ఫోర్లు, 1 సిక్స్‌), ఫఖర్‌ జమాన్‌ (56; 7 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు.

దెబ్బకొట్టిన నసీం షా
అంతకుముందు న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 255 పరుగులు సాధించింది. నసీమ్‌ షా (5/57) కివీస్‌ను దెబ్బ తీశాడు. ఇక కివీస్‌ ఇన్నింగ్స్‌లోబ్రాస్‌వెల్‌ 43 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. టామ్‌ లాథమ్‌ 42 పరుగులు చేశాడు. మిగతా వాళ్లు నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. ఇక పాక్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్‌ నసీం షాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

ముందంజలో పాక్‌
కాగా టెస్టు, వన్డే సిరీస్‌ ఆడే నిమిత్తం న్యూజిలాండ్‌ పాక్‌ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. రెండు టెస్టు మ్యాచ్‌లు డ్రాగా ముగియగా.. తొలి వన్డేలో పాక్‌ విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది.

పాకిస్తాన్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ తొలి వన్డే స్కోర్లు
టాస్‌: పాకిస్తాన్‌- బౌలింగ్‌
న్యూజిలాండ్‌: 255/9 (50)
పాకిస్తాన్‌: 258/4 (48.1)
ఆరు వికెట్ల తేడాతో పాక్‌ విజయం

చదవండి: Ind Vs SL: సూర్య, ఉమ్రాన్‌కు నో ఛాన్స్‌!.. ఇంత వరకు ఇక్కడ ఒకే ఒక వన్డే.. ఫలితం?
Rohit Sharma: నేను అంతర్జాతీయ టి20లకు గుడ్‌బై చెప్పలేదు.. అయితే ఐపీఎల్‌ తర్వాత!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement