వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా వార్మప్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే హైదరాబాద్ వేదికగా సెప్టెంబర్ 29న న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్‌ను ప్రేక్షకులు లేకుండానే జరగనుంది.
భద్రతా కారణాల దృష్ట్యా ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించ కూడదని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. టికెట్లు కొనుగోలు చేసిన వారికి మొత్తం డబ్బులు తిరిగి చెల్లించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
"ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్-పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్ ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. స్థానిక భద్రతా సంస్థల సలహా మేరకు ఖాళీ స్టేడియంలోనే మ్యాచ్‌ను నిర్వహించనున్నాం. ఒకే రోజు రెండు పండగలు రావడంతో భద్రత విషయంలో ఇబ్బంది ఉంటుందని పోలీసులు తెలిపారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రతీ ఒక్కరికి రిఫెండ్ చేస్తామని" బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
చదవండి: World Cup 2023: ‘వీసా’ వచ్చేసింది... రేపు హైదరాబాద్‌కు పాకిస్తాన్ జట్టు
Comments
Please login to add a commentAdd a comment