warmup match
-
న్యూజిలాండ్- పాక్ వార్మప్ మ్యాచ్.. బీసీసీఐ కీలక ప్రకటన
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా వార్మప్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే హైదరాబాద్ వేదికగా సెప్టెంబర్ 29న న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్‌ను ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించ కూడదని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. టికెట్లు కొనుగోలు చేసిన వారికి మొత్తం డబ్బులు తిరిగి చెల్లించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. "ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్-పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్ ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. స్థానిక భద్రతా సంస్థల సలహా మేరకు ఖాళీ స్టేడియంలోనే మ్యాచ్‌ను నిర్వహించనున్నాం. ఒకే రోజు రెండు పండగలు రావడంతో భద్రత విషయంలో ఇబ్బంది ఉంటుందని పోలీసులు తెలిపారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రతీ ఒక్కరికి రిఫెండ్ చేస్తామని" బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి: World Cup 2023: ‘వీసా’ వచ్చేసింది... రేపు హైదరాబాద్‌కు పాకిస్తాన్ జట్టు -
నేడు ఆసీస్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్..
దుబాయ్: టి20 ప్రపంచకప్ లక్ష్యంగా గట్టి ప్రాక్టీస్ కోసం కోహ్లి సేన తహతహలాడుతోంది. ఇంగ్లండ్‌తో తొలి ప్రాక్టీస్‌లో అదరగొట్టిన భారత్ నేడు ఆ్రస్టేలియాతో ఆఖరి ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగా చేసుకొని జట్టు కూర్పును టీమ్ మేనేజ్మెంట్ ఖరారు చేసే అవకాశముంది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. ఓపెనింగ్‌లో రోహిత్‌కు జతగా కేఎల్ రాహుల్ ఖాయమయ్యాడు. మూడో స్థానం ఎలాగూ కోహ్లిదే. ఇంగ్లండ్‌పై మెరిపించిన ఇషాన్ కిషన్ కూడా తుదిజట్టులో చోటు దక్కించుకోవచ్చు. రిషభ్ పంత్‌కు ఢోకా లేకపోయినా... సూర్యకుమార్‌కు కచ్చితంగా స్థానం లభిస్తుందన్న ధీమా లేదు. బుధవారం నాటి మ్యాచ్‌లో సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతోపాటు శార్దుల్ ఠాకూర్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలను ఆడించాక జట్టు మేనేజ్మెంట్ తుది కూర్పుపై ఓ అంచనాకు వస్తుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆదివారం మొదలయ్యే ప్రపంచకప్ సమరానికి దీటైన జట్టుతో కోహ్లి సేన బరిలోకి దిగనుంది. ఇక మరోవైపు ఆ్రస్టేలియా కూడా ఈ ఆఖరి ప్రాక్టీస్ మ్యాచ్‌ను తుది జట్టు కూర్పుపై స్పష్టత వచ్చేందుకు వినియోగించుకోనుంది. మొదటి వార్మప్ పోరులో కివీస్‌ను ఓడించిన ఆ్రస్టేలియా ఇదే ఉత్సాహంతో భారత్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. జట్లు: భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, సూర్యకుమార్, పంత్, ఇషాన్, పాండ్యా, జడేజా, చహర్, అశి్వన్, వరుణ్, బుమ్రా, భువనేశ్వర్, షమీ, శార్దుల్. ఆ్రస్టేలియా: ఫించ్ (కెప్టెన్), వార్నర్, స్టొయినిస్, అగర్, కమిన్స్, హేజల్‌వుడ్, ఇంగ్లిస్, మార్ష్ మ్యాక్స్‌వెల్, రిచర్డ్సన్, స్మిత్, స్టార్క్, స్వెప్సన్, వేడ్, జంపా. చదవండి: T20 WC IND vs PAK: బాబర్ అజమ్ బ్యాటింగ్.. రెప్పవాల్చని టీమిండియా ఆటగాళ్లు -
బంగ్లాదేశ్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ నేడు
కార్డిఫ్: ప్రపంచకప్‌నకు ముందు ఆఖరి సన్నాహానికి భారత్ సిద్ధమైంది. నేడు జరిగే వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత టాపార్డర్ పూర్తిగా బ్యాట్లెత్తేసింది. దీంతో అసలైన పోరుకు ముందు మిగిలిన ఈ ఒకే ఒక మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకోవాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు. మరోవైపు బంగ్లా పరిస్థితి భిన్నంగా ఉంది. పాక్‌తో జరగాల్సిన మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే వర్షార్పణమైంది. ఇక మిగిలున్న ఈ మ్యాచ్ద్వారానైనా వార్మప్ లబ్ధి పొందాలని భావిస్తోంది. సోమవారం జరిగిన ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా జట్టు ఐదు వికెట్లతో శ్రీలంకపై... ఇంగ్లండ్ తొమ్మిది వికెట్లతో అఫ్గానిస్తాన్‌పై గెలిచాయి. తొలుత శ్రీలంక 8 వికెట్లకు 239 పరుగులు చేయగా... ఆస్ట్రేలియా 44.5 ఓవర్లలో 5 వికెట్లకు 241 పరుగులు చేసి గెలిచింది. మరోవైపు అఫ్గానిస్తాన్ 38.4 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ 17.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 161 పరుగులు చేసి నెగ్గింది. -
సునీల్ ఆంబ్రిస్ సెంచరీ
వడోదర: బ్యాట్స్‌మెన్ రాణించడంతో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో జరిగిన రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌ను విండీస్ ‘డ్రా’ చేసుకుంది. ఆదివారం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 89 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఆంబ్రిస్ (98 బంతుల్లో 114 నాటౌట్; 17 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ శతకంతో ఆకట్టుకున్నాడు. ఓపె నర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (52; 9 ఫోర్లు), కీరన్ పావెల్ (44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టుకు శుభారంభాన్ని అందించిన అనంతరం అందరికీ ప్రాక్టీస్ దక్కేందుకు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగారు. ఆ తర్వాత హెట్‌మైర్ (7), చేజ్ (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా... హోప్ (36; 5 ఫోర్లు), డౌరిచ్ (65; 9 ఫోర్లు, 1 సిక్స్)ల అండతో ఆంబ్రిస్ జట్టుకు భారీ స్కోరు సాధించి పెట్టాడు. బోర్డు ఎలెవెన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టగా... సౌరభ్‌కు 2 వికెట్లు దక్కాయి. అంతకుముందు బోర్డు ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 360 పరుగులు చేసింది. -
భారత్‌లో విండీస్ పర్యటన తేదీలు ఖరారు
న్యూఢిల్లీ: భారత్‌లో వెస్టిండీస్ పర్యటన వచ్చే నెలాఖరులో మొదలవనుంది. ఇక్కడ ఆడేందుకు విండీస్ బోర్డు సమ్మతించడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పర్యటనను ఖరారు చేసింది. మొత్తం మీద బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ 200వ టెస్టు స్వదేశంలోనే జరగనుందనే విషయం అధికారికంగా స్పష్టమైంది. నాలుగు వారాల పాటు జరిగే ఈ టూర్లో వెస్టిండీస్... ఆతిథ్య జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడుతుంది. ఒక మూడు రోజుల వార్మప్ మ్యాచ్ కూడా జరగనుంది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 వరకు పర్యటన సాగుతుంది. అయితే తేదీలు, వేదికల వివరాలను తర్వాత వెల్లడిస్తామని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. సచిన్ 200వ టెస్టును తన పుట్టింటిలో (వాంఖడే)లో నిర్వహించేందుకు ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) తహతహలాడుతున్నప్పటికీ... రొటేషన్ పద్ధతి ప్రకారం ఈ టెస్టు మొతేరా స్టేడియం (అహ్మదాబాద్)లో జరగాల్సివుంది. కానీ ముంబైతో పాటు కోల్‌కతా కూడా ‘మాస్టర్’ ఘనతను కొట్టేయాలనుకుంటున్నాయి.