దుబాయ్: టి20 ప్రపంచకప్ లక్ష్యంగా గట్టి ప్రాక్టీస్ కోసం కోహ్లి సేన తహతహలాడుతోంది. ఇంగ్లండ్‌తో తొలి ప్రాక్టీస్‌లో అదరగొట్టిన భారత్ నేడు ఆ్రస్టేలియాతో ఆఖరి ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగా చేసుకొని జట్టు కూర్పును టీమ్ మేనేజ్‌మెంట్ ఖరారు చేసే అవకాశముంది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. ఓపెనింగ్‌లో రోహిత్‌కు జతగా కేఎల్ రాహుల్ ఖాయమయ్యాడు. మూడో స్థానం ఎలాగూ కోహ్లిదే. ఇంగ్లండ్‌పై మెరిపించిన ఇషాన్ కిషన్ కూడా తుదిజట్టులో చోటు దక్కించుకోవచ్చు. రిషభ్ పంత్‌కు ఢోకా లేకపోయినా... సూర్యకుమార్‌కు కచ్చితంగా స్థానం లభిస్తుందన్న ధీమా లేదు.
బుధవారం నాటి మ్యాచ్‌లో సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతోపాటు శార్దుల్ ఠాకూర్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలను ఆడించాక జట్టు మేనేజ్‌మెంట్ తుది కూర్పుపై ఓ అంచనాకు వస్తుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆదివారం మొదలయ్యే ప్రపంచకప్ సమరానికి దీటైన జట్టుతో కోహ్లి సేన బరిలోకి దిగనుంది. ఇక మరోవైపు ఆ్రస్టేలియా కూడా ఈ ఆఖరి ప్రాక్టీస్ మ్యాచ్‌ను తుది జట్టు కూర్పుపై స్పష్టత వచ్చేందుకు వినియోగించుకోనుంది. మొదటి వార్మప్ పోరులో కివీస్‌ను ఓడించిన ఆ్రస్టేలియా ఇదే ఉత్సాహంతో భారత్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది.
జట్లు:
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, సూర్యకుమార్, పంత్, ఇషాన్, పాండ్యా, జడేజా, చహర్, అశి్వన్, వరుణ్, బుమ్రా, భువనేశ్వర్, షమీ, శార్దుల్.
ఆ్రస్టేలియా: ఫించ్ (కెప్టెన్), వార్నర్, స్టొయినిస్, అగర్, కమిన్స్, హేజల్‌వుడ్, ఇంగ్లిస్, మార్ష్ మ్యాక్స్‌వెల్, రిచర్డ్‌సన్, స్మిత్, స్టార్క్, స్వెప్సన్, వేడ్, జంపా.
చదవండి: T20 WC IND vs PAK: బాబర్ అజమ్ బ్యాటింగ్.. రెప్పవాల్చని టీమిండియా ఆటగాళ్లు
Comments
Please login to add a commentAdd a comment