సునీల్‌ ఆంబ్రిస్‌ సెంచరీ | Sunil Ambris Slams 114 as Warm-up Match Ends in a Draw | Sakshi
Sakshi News home page

సునీల్‌ ఆంబ్రిస్‌ సెంచరీ

Published Mon, Oct 1 2018 5:18 AM | Last Updated on Mon, Oct 1 2018 5:18 AM

Sunil Ambris Slams 114 as Warm-up Match Ends in a Draw - Sakshi

ఆంబ్రిస్‌

వడోదర: బ్యాట్స్‌మెన్‌ రాణించడంతో బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవెన్‌తో జరిగిన రెండు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ను విండీస్‌ ‘డ్రా’ చేసుకుంది. ఆదివారం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 89 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. ఆంబ్రిస్‌ (98 బంతుల్లో 114 నాటౌట్‌; 17 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ శతకంతో ఆకట్టుకున్నాడు. ఓపె నర్లు క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (52; 9 ఫోర్లు), కీరన్‌ పావెల్‌ (44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టుకు శుభారంభాన్ని అందించిన అనంతరం అందరికీ ప్రాక్టీస్‌ దక్కేందుకు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగారు. ఆ తర్వాత హెట్‌మైర్‌ (7), చేజ్‌ (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా... హోప్‌ (36; 5 ఫోర్లు), డౌరిచ్‌ (65; 9 ఫోర్లు, 1 సిక్స్‌)ల అండతో ఆంబ్రిస్‌ జట్టుకు భారీ స్కోరు సాధించి పెట్టాడు. బోర్డు ఎలెవెన్‌ బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌ 4 వికెట్లు పడగొట్టగా... సౌరభ్‌కు 2 వికెట్లు దక్కాయి. అంతకుముందు బోర్డు ఎలెవన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 360 పరుగులు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement