Indian Board Presidents XI
-
సునీల్ ఆంబ్రిస్ సెంచరీ
వడోదర: బ్యాట్స్‌మెన్ రాణించడంతో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో జరిగిన రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌ను విండీస్ ‘డ్రా’ చేసుకుంది. ఆదివారం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 89 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఆంబ్రిస్ (98 బంతుల్లో 114 నాటౌట్; 17 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ శతకంతో ఆకట్టుకున్నాడు. ఓపె నర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (52; 9 ఫోర్లు), కీరన్ పావెల్ (44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టుకు శుభారంభాన్ని అందించిన అనంతరం అందరికీ ప్రాక్టీస్ దక్కేందుకు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగారు. ఆ తర్వాత హెట్‌మైర్ (7), చేజ్ (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా... హోప్ (36; 5 ఫోర్లు), డౌరిచ్ (65; 9 ఫోర్లు, 1 సిక్స్)ల అండతో ఆంబ్రిస్ జట్టుకు భారీ స్కోరు సాధించి పెట్టాడు. బోర్డు ఎలెవెన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టగా... సౌరభ్‌కు 2 వికెట్లు దక్కాయి. అంతకుముందు బోర్డు ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 360 పరుగులు చేసింది. -
ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆసీస్ ఘనవిజయం..
చెన్నై: ఇండియన్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరిగిన వన్డే ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. ఆసీస్ బౌలర్ల దాటికి బోర్డు ప్రెసిడెంట్స్ జట్టు 48.2 ఓవర్లలో 244 పరుగులకే కుప్పకూలింది. 348 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బోర్డు ప్రెసిడెంట్స్ బ్యాట్స్‌మెన్స్ ఆసీస్ బౌలర్ల దాటికి బెంబేలెత్తారు. ప్రెసిడెంట్ బ్యాట్స్‌మెన్స్‌లో అగర్వాల్, కర్నేవార్(40), కేడీ పటేల్(41) రాణించారు. ఆసీస్ బౌలర్లలో ఏసీ అగర్‌కు నాలుగు వికెట్లు, రిచర్డ్సన్కు రెండు, ఫాల్కనర్, జంపా, స్టెయినీస్లకు తలో వికెట్ దక్కింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ వార్నర్(64;48 బంతుల్లో11 ఫోర్లు) , స్మిత్ (55;68 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), ట్రావిస్ హెడ్(65;63 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్), స్టోనిస్(76;60 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) లు హాఫ్ సెంచరీలు సాధించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 347 పరుగులు చేసింది. ఇండియన్ బోర్డు ఎలెవన్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, కుశాంగ్ పటేల్ తలో రెండు వికెట్లు సాధించగా, అవేశక ఖాన్, అక్షయ్ కార్నేశ్వర్, కుల్వంత్ తలో వికెట్ తీశారు. -
ఆసీస్ 'ప్రాక్టీస్'అదిరింది
చెన్నై: ఇండియన్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరుగుతున్న వన్డే ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా అదుర్స్ అనిపించింది. బోర్డు ఎలెవన్ కు 348 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించి బ్యాటింగ్ లో సత్తా చూపెట్టింది. ఆసీస్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, స్టోనిస్ లు అర్థ శతకాలతో దుమ్మురేపారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఆదిలోనే హిల్టన్ కార్ట్ రైట్ వికెట్ ను కోల్పోయింది. కార్ట్ రైట్ ఖాతా తెరవకుండానే అవేశ్ ఖాన్ బౌలింగ్ లో అవుటయ్యారు. ఆపై వార్నర్(64;48 బంతుల్లో11 ఫోర్లు) తో కలిసిన స్మిత్ (55;68 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.ఈ ఇద్దరూ రెండో వికెట్ కు 106 పరుగులు జోడించి ఆసీస్ ను పటిష్టస్థితికి చేర్చారు.కాకపోతే వార్నర్, స్మిత్ లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో ఆసీస్ 134 పరుగుల వద్ద మూడో వికెట్ ను నష్టపోయింది. ఆపై ట్రావిస్ హెడ్(65;63 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్), స్టోనిస్(76;60 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) లు సైతం హాఫ్ సెంచరీలు సాధించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 347 పరుగులు చేసింది. ఇండియన్ బోర్డు ఎలెవన్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, కుశాంగ్ పటేల్ తలో రెండు వికెట్లు సాధించగా, అవేశక ఖాన్, అక్షయ్ కార్నేశ్వర్, కుల్వంత్ తలో వికెట్ తీశారు. -
ఏబీ.. అదే జోరు
* సెంచరీ బాదిన డివిలియర్స్ * భారత బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ‘డ్రా’ ముంబై: మ్యాచ్ ఎలాంటిదైనా దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ (131 బంతుల్లో 112; 18 ఫోర్లు) జోరు మాత్రం తగ్గడం లేదు. బోర్డు ప్రెసిడెంట్ జట్టు కుర్ర బౌలర్లను ఓ ఆటాడుకుంటూ ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ సెంచరీతో శివాలెత్తాడు. దీంతో ఇరుజట్ల మధ్య శనివారం ముగిసిన రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ‘డ్రా’ అయ్యింది. డివిలియర్స్‌కు తోడు విలాస్ (78 బంతుల్లో 54; 7 ఫోర్లు) అర్ధసెంచరీ చేయడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 69.2 ఓవర్లలో 302 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బోర్డు జట్టు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. రాహుల్ (43 నాటౌట్), పుజారా (49 నాటౌట్) ఆకట్టుకున్నారు. అంతకుముందు 46/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన ప్రొటీస్... స్వల్ప వ్యవధిలో ఎల్గర్ (23), డు ప్లెసిస్ (4), ఆమ్లా (1)ల వికెట్లను కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ దెబ్బకు సఫారీ జట్టు 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన డివిలియర్స్ బోర్డు బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు. పేస్ బౌలింగ్‌లో కాస్త నియంత్రణతో ఆడిన ఏబీ.. కరణ్ శర్మ స్పిన్‌ను దారుణంగా దెబ్బతీశాడు. కట్, స్వీప్, ఫుల్, డ్రైవ్‌లతో వరుస బౌండరీలు బాదాడు. బావుమా (15)తో కలిసి ఆరో వికెట్‌కు 54 పరుగులు జోడించిన డివిలియర్స్... విలాస్‌తో కలిసి ఏడో వికెట్‌కు 115 పరుగులు సమకూర్చాడు. చివరకు టీ తర్వాత స్పిన్నర్ జయంత్... ఏబీని అవుట్ చేయడంతో బోర్డు జట్టు ఊపిరి పీల్చుకుంది. ఫిలాండర్ (12) విఫలమైనా... స్టెయిన్ (28 బంతుల్లో 37; 6 ఫోర్లు, 1 సిక్స్) భారీ షాట్లు ఆడటంతో ప్రొటీస్ స్కోరు మూడొందలు దాటింది. శార్దూల్ 4, జయంత్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. స్కోరు వివరాలు భారత బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 296 ఆలౌట్ దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: వాన్‌జెల్ (సి) ఉన్ముక్త్ (బి) ఠాకూర్ 18; ఎల్గర్ (సి) ఉన్ముక్త్ (బి) సింగ్ 23; హర్మర్ (సి) ఓజా (బి) ఠాకూర్ 4; డు ప్లెసిస్ ఎల్బీడబ్ల్యు (బి) ఠాకూర్ 4; ఆమ్లా (సి) నాయర్ (బి) ఠాకూర్ 1; డివిలియర్స్ (బి) జయంత్ 112; బావుమా (సి) అయ్యర్ (బి) పాండ్యా 15; విలాస్ (బి) జయంత్ 54; ఫిలాండర్ (బి) కుల్దీప్ 12; స్టెయిన్ (బి) కుల్దీప్ 37; రబడ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 21; మొత్తం: (69.2 ఓవర్లలో ఆలౌట్) 302. వికెట్ల పతనం: 1-38; 2-46; 3-54; 4-57; 5-57; 6-111; 7-226; 8-259; 9-285; 10-302. బౌలింగ్: శార్దూల్ ఠాకూర్ 16-3-70-4; నాథ్ సింగ్ 14.4-2-56-1; హార్డిక్ పాండ్యా 14-1-64-1; కరణ్ శర్మ 8-0-43-0; జయంత్ యాదవ్ 8-2-37-2; కుల్దీప్ యాదవ్ 8.4-0-24-2. భారత బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ నాటౌట్ 43; పుజారా నాటౌట్ 49; ఎక్స్‌ట్రాలు: 0; మొత్తం: (30 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 92; బౌలింగ్: హర్మర్ 10-2-24-0; పిడెట్ 10-3-32-0; తాహిర్ 5-0-25-0; ఎల్గర్ 5-0-11-0.