ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆసీస్ ఘనవిజయం..
ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆసీస్ ఘనవిజయం..
Published Tue, Sep 12 2017 5:58 PM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM
చెన్నై: ఇండియన్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్తో జరిగిన వన్డే ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. ఆసీస్ బౌలర్ల దాటికి బోర్డు ప్రెసిడెంట్స్ జట్టు 48.2 ఓవర్లలో 244 పరుగులకే కుప్పకూలింది. 348 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బోర్డు ప్రెసిడెంట్స్ బ్యాట్స్‌మెన్స్ ఆసీస్ బౌలర్ల దాటికి బెంబేలెత్తారు. ప్రెసిడెంట్ బ్యాట్స్‌మెన్స్‌లో అగర్వాల్, కర్నేవార్(40), కేడీ పటేల్(41) రాణించారు. ఆసీస్ బౌలర్లలో ఏసీ అగర్‌కు నాలుగు వికెట్లు, రిచర్డ్సన్‌కు రెండు, ఫాల్కనర్, జంపా, స్టెయినీస్‌లకు తలో వికెట్ దక్కింది.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ వార్నర్(64;48 బంతుల్లో11 ఫోర్లు) , స్మిత్ (55;68 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), ట్రావిస్ హెడ్(65;63 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్), స్టోనిస్(76;60 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) లు హాఫ్ సెంచరీలు సాధించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 347 పరుగులు చేసింది. ఇండియన్ బోర్డు ఎలెవన్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, కుశాంగ్ పటేల్ తలో రెండు వికెట్లు సాధించగా, అవేశక ఖాన్, అక్షయ్ కార్నేశ్వర్, కుల్వంత్ తలో వికెట్ తీశారు.
Advertisement
Advertisement