బంగ్లాదేశ్‌తో భారత్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ నేడు | India practice match with Bangladesh today | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌తో భారత్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ నేడు

May 28 2019 5:44 AM | Updated on May 30 2019 1:56 PM

India practice match with Bangladesh today - Sakshi

కార్డిఫ్‌: ప్రపంచకప్‌నకు ముందు ఆఖరి సన్నాహానికి భారత్‌ సిద్ధమైంది. నేడు జరిగే వార్మప్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత టాపార్డర్‌ పూర్తిగా బ్యాట్లెత్తేసింది. దీంతో  అసలైన పోరుకు ముందు మిగిలిన ఈ ఒకే ఒక మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకోవాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు. మరోవైపు బంగ్లా పరిస్థితి భిన్నంగా ఉంది. పాక్‌తో జరగాల్సిన మ్యాచ్‌ ఒక్క బంతి పడకుండానే వర్షార్పణమైంది. ఇక మిగిలున్న ఈ మ్యాచ్‌ద్వారానైనా వార్మప్‌ లబ్ధి పొందాలని భావిస్తోంది.   సోమవారం జరిగిన ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా జట్టు ఐదు వికెట్లతో శ్రీలంకపై... ఇంగ్లండ్‌ తొమ్మిది వికెట్లతో అఫ్గానిస్తాన్‌పై గెలిచాయి. తొలుత శ్రీలంక 8 వికెట్లకు 239 పరుగులు చేయగా... ఆస్ట్రేలియా 44.5 ఓవర్లలో 5 వికెట్లకు 241 పరుగులు చేసి గెలిచింది. మరోవైపు అఫ్గానిస్తాన్‌ 38.4 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ 17.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 161 పరుగులు చేసి నెగ్గింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement