వన్డే ప్రపంచకప్-2023కు రంగం సిద్దమైంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. కాగా ప్రధాన టోర్నీ ప్రారంభానికి ముందు వార్మప్ మ్యాచ్‌లు ఆడేందుకు సన్నద్ధమవుతున్నాయి. సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 3 వరకు ఈ సన్నహాక మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్‌లకు హైదరాబాద్, తిరువనంతపురం, గువాహటి వేదికలగా మారనున్నాయి.
పాకిస్తాన్ నెట్‌బౌలర్‌గా హైదరాబాద్ కుర్రాడు
ఇక వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు హైదరాబాద్ వేదికగా శుక్రవారం న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్న పాక్ జట్టు తమ ప్రాక్టీస్ సెషన్స్‌ను కూడా మొదలు పెట్టేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ అండర్-19 ఫాస్ట్‌బౌలర్ నిశాంత్ సరను తమ నెట్‌బౌలర్‌గా పాకిస్తాన్ నియమించకుంది.
కివీస్ వార్మప్ మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో పాక్ బ్యాటర్లకు నిశాంత్ బౌలింగ్ చేస్తూ కన్పించాడు. ఈ యువ హైదరబాదీ పేసర్ గంటకు 140 నుంచి 150 వేగంతో బంతులు విసరగలడు. అదే విధంగా ఆరు అడుగులకు పైగా ఉన్న నిశాంత్ బౌన్సర్స్‌ను సంధించగలడు. నెట్స్‌లో అతడి బౌలింగ్‌ను ఎదుర్కొన్న పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
నిశాంత్‌కు అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయని, కచ్చితంగా అతడు అత్యున్నత స్ధాయికి చేరుకుంటాడని జమాన్ కొనియాడాడు. అదే విధంగా నిశాంత్ మాట్లాడుతూ.. తనకు ఆస్ట్రేలియా స్టార్ పేసర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్ ఆదర్శమని తెలిపాడు. అంతేకాకుండా హైదరాబాద్‌కు ఆడాలన్న తన కోరికను నిశాంత్ వ్యక్తం చేశాడు.
చదవండి: WC 2023: చారిత్మాతక డీల్.. ఆటగాళ్లకు పీసీబీ గిఫ్ట్! వాళ్లకు ఏకంగా 202 శాతం హైక్
Comments
Please login to add a commentAdd a comment