హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి: బాబర్‌ భావోద్వేగం | 'Overwhelmed With The Love And Support': Babar Azam Thanks Indian Fans Ahead WC 2023 | Sakshi
Sakshi News home page

#Babar Azam: హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యా: బాబర్‌ భావోద్వేగం

Published Thu, Sep 28 2023 12:53 PM | Last Updated on Tue, Oct 3 2023 7:43 PM

WC 2023 Overwhelmed With Love And Support: Babar Azam Thanks Fans - Sakshi

ICC WC 2023: #welcometoindia- #Babar Azam: పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం హైదరాబాదీల ప్రేమకు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తమకు ఘన స్వాగతం పలికినందుకు సంతోషంగా ఉందంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023 ఆడేందుకు పాక్‌ క్రికెట్‌ జట్టు భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.

పాకిస్తాన్‌ ఆడనున్న వార్మప్‌, కొన్ని ప్రధాన మ్యాచ్‌లకు హైదరాబాద్‌ వేదికకానున్న తరుణంలో బుధవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయంలో టీమ్‌ ల్యాండ్‌ అయింది. వీసా సమస్యలు తీరడంతో దుబాయ్‌ నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకుంది.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం
ఈ క్రమంలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు వారికి స్వాగతం పలకగా.. పోలీసుల పటిష్ట భద్రత నడుమ పార్క్‌ హయత్‌కు ఆటగాళ్లు చేరుకున్నారు. కాగా దాదాపు ఏడేళ్ల తర్వాత పాక్‌ జట్టు ఇండియాకు రావడం ఇదే తొలిసారి.

ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా
ఈ నేపథ్యంలో కొంతమంది అభిమానులు సైతం ఎయిర్‌పోర్టు బయట దారి పొడవునా నిల్చొని ఘన స్వాగతం పలికారు. టీమ్‌ బస్‌లో తరలివెళ్తున్న పాక్‌ క్రికెటర్లను కెమెరాలలో బంధిస్తూ వారికి విష్‌ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఈ క్రమంలో బాబర్‌ ఆజం హైదరాబాద్‌ ఆతిథ్యానికి ముగ్ధుడయ్యాడు. ‘‘హైదరాబాద్‌లో.. మీ అంతులేని ప్రేమ, మద్దతు చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ఈ మేరకు బాబర్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

ఉప్పల్‌లో ప్రధాన మ్యాచ్‌లు ఇవే
కాగా ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌‌ స్టేడియంలో పాకిస్తాన్‌ శుక్రవారం న్యూజిలాండ్‌తో తమ తొలి వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. అదే విధంగా... అక్టోబర్‌ 3న ఆస్ట్రేలియాతో ఆడుతుంది. 

తదుపరి.. వరల్డ్‌కప్‌ ప్రధాన మ్యాచ్‌లలో భాగంగా.. అక్టోబర్‌ 6న నెదర్లాండ్స్‌తో, అక్టోబర్‌ 10న శ్రీలంకతో పోటీపడుతుంది. ఇక ఇండియాకు బయల్దేరే ముందు బాబర్‌ ఆజం మాట్లాడుతూ.. తమ జట్టు ఈ ఐసీసీ టోర్నీలో అత్యుత్తమంగా రాణిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. 

చదవండి: చాలా సంతోషంగా ఉన్నా.. అతడు మాత్రం అద్భుతం! వరల్డ్‌కప్‌లో కూడా: రోహిత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement