వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆట తీరుపై టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ మండిపడ్డాడు. బాబర్ ఆజం కేవలం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడాడని గంభీర్ విమర్శించాడు.
"బాబర్ అజం చాలా పిరికివాడు. ఇద్దరు బ్యాటర్లు భాగస్వామ్యం నెలకొల్పే క్రమంలో ఎవరో ఒకరు కొంచెం దూకుడుగా ఆడాలి. రిజ్వాన్ కంటే ముందు బాబర్ బ్యాటింగ్ వచ్చాడు. కాబట్టి ఆజం ఛాన్స్‌లు తీసుకుని ఆడాల్సింది. ఫిప్టీ కోసమో లేదా మీ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడితే ఇటువంటి ఫలితాలే ఎదురవతాయి.
అంతర్జాతీయ క్రికెట్‌లో బాబర్ ఇప్పటికే చాలా పరుగులు సాధించాడు. ఎన్నో రికార్డులు కూడా తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్తాన్ క్రికెట్ గత చరిత్ర చూసుకుంటే షాహిద్ అఫ్రిది, ఇమ్రాన్ నజీర్, తౌఫీక్ ఉమర్ వంటి ఆటగాళ్లు ఆరంభంలో దూకుడుగా ఆడేవారు. క్రీజులో సెటిల్ అయ్యాక ప్రత్యర్ధి బౌలర్లపై ఒత్తడి పెంచేవారు.
కానీ ప్రస్తుత పాకిస్తాన్ జట్టు టాపర్డర్‌లో అటువంటి ఆటగాడు ఒక్కడు కూడా లేడు. భారత్ వంటి క్వాలిటీ బౌలింగ్ ఎటాక్ ఎదుర్కొవలసి వచ్చినప్పుడు ఎటువంటి భయం లేకుండా ఆడాలని ముందే డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించుకోవాలి. అంతే తప్ప పిరికిగా మాత్రం ఆడకూడదు. అలా అయితే టాప్ 3 బ్యాటర్లు ఔట్ కాగానే మిగితా బ్యాటర్లకు పెవిలియన్‌కు క్యూ కడతారని స్టార్‌స్పోర్ట్స్ షోలో గంభీర్ పేర్కొన్నాడు.
చదవండి: WC 2023: ఎదుటి వాళ్లను అన్నపుడు నవ్వుకొని.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు? అతడికి స్ట్రాంగ్ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment