న్యూజిలాండ్‌తో తొలి టీ20కు ముందు పాకిస్తాన్ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర కీపర్-బ్యాటర్ ఆజం ఖాన్ గాయం కారణంగా తొలి టీ20కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. గురువారం రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టీ20లో పాకిస్తాన్-కివీస్ జట్లు తలపడనున్నాయి.
ఈ క్రమంలో బుధవారం నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోన్న ఆజం మోకాలికి గాయమైంది. మెకాలికి బంతి బలంగా తాకడంతో ఆజం తీవ్రమైన నోప్పితో విలవిల్లాడినట్లు సమాచారం. ఈ క్రమంలో అతడిని తొలి టీ20కు పక్కన పెట్టాలని పాక్ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వినికిడి.
కాగా ఆజం ఖాన్ ప్రస్తుతం పీసీబీ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. కాగా తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకునేందుకు కాకుల్ ఆర్మీ క్యాంపులో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా శిబిరంలో ఆజం ఖాన్ తీవ్రంగా శ్రమించాడు.
అతడితో పాటు జట్టు మొత్తం 11-రోజుల ఫిట్‌నెస్ క్యాంప్‌లో పాల్గోంది. కాగా ఈ సిరీస్ టీ20 వరల్డ్‌కప్-2024 సన్నహాకాల్లో భాగంగా జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు ఐదు టీ20లు ఆడనున్నాయి. అయితే పాక్ పర్యటనకు కివీస్ క్రికెట్ బోర్డు తమ ద్వితీయ శ్రేణి జట్టును పంపించింది. స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్-2024 సీజన్‌లో బీజీబీజీగా ఉండడంతో న్యూజిలాండ్ క్రికెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment