
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకు ముందు పాకిస్తాన్ వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ టైటిల్‌ను న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన కరాచీ వేదికగా జరిగిన పైనల్లో పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం సాధించింది. అయితే ఓ దశలో కివీస్‌కు గట్టిపోటీ ఇచ్చిన పాక్ జట్టు.. ఆ తర్వాత సొంత తప్పిదాల వల్ల మ్యాచ్‌పై పట్టుకోల్పోయింది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన పాక్ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది.
మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కూడా బ్లాక్ క్యాప్స్ చేతిలోనే పాక్ ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో మహ్మద్ రిజ్వాన్ అండ్ కోపై పాక్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ విమర్శలు గుప్పించాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ ఆట తీరు ఎలా ఉందో తేటతెల్లమైందని షెహజాద్ మండిపడ్డాడు. కాగా ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు ఫీల్డింగ్‌లో తీవ్ర నిరాశపరిచింది.
"టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ చేసిన ఘోర తప్పిదంగా పరిగణించాలి. నిజంగా అదొక చెత్త నిర్ణయం. ఎందుకంటే ఈ వేదికలో జరిగిన గత మ్యాచ్‌లో పిచ్ రాత్రిపూట బ్యాటింగ్‌కు అనుకూలించడం మనం చూశాము. తేమ ఎక్కువగా వల్ల స్పిన్నర్లు కూడా పట్టు సాధించలేకపోయారు. అందువల్ల బంతి చక్కగా బ్యాట్‌పైకి వచ్చింది.
అయినప్పటికి పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అస్సలు ఈ నిర్ణయం తీసుకున్నారో ఎందుకు నాకు ఆర్దం కావడం లేదు. ఇదొక్కటే కాదు ఈ మ్యాచ్‌లో చాలా తప్పులు చేశారు. కొన్ని కొన్ని నిర్ణయాలు మరీ చైల్డీష్‌గా ఉన్నాయి. ప్రత్యర్థి స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తేనే మనం విజయం సాధించే అవకాశముంటుంది.
అంతేకాకుండా జట్టులోని ప్రధాన ఆటగాళ్లు సైతం రాణించాల్సిన అవసరముంది. లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీ వంటి మెగా టోర్నీలో సమస్యలు ఎదుర్కొకతప్పదు అని షెహజాద్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
బాబర్ మళ్లీ ఫెయిల్..
కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ (76 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 46) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సల్మాన్ అఘా(65 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 45) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
కానీ బాబర్ ఆజం మాత్రం మరోసారి తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 29 పరుగులు మాత్రమే చేసి ఆజం పెవిలియన్‌కు చేరాడు. న్యూజిలాండ్ బౌలర్లలో విల్ ఓ రూర్కీ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. మైకేల్ బ్రేస్‌వెల్(2/38), మిచెల్ సాంట్నర్(2/20) తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు జాకోబ్ డఫ్ఫీ, నాథన్ స్మిత్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం 243 పరుగుల లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు కోల్పోయి 45.2 ఓవర్లలో చేధించి గెలుపొందింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(58 బంతుల్లో 6 ఫోర్లతో 57), టామ్ లాథమ్(64 బంతుల్లో 5 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. వీరిద్దరితో పాటు డెవాన్ కాన్వే (74 బంతుల్లో 5 ఫోర్లతో 48) కూడా రాణించాడు.
చదవండి: ENG vs IND: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్?
Comments
Please login to add a commentAdd a comment