Pak Vs NZ: Pakistan Won By 38 Runs, Babar Azam Equals Dhoni Eyes On World Record - Sakshi
Sakshi News home page

Babar Azam: సెంచరీతో చెలరేగిన బాబర్‌ ఆజం.. ప్రపంచ రికార్డు

Published Sun, Apr 16 2023 10:56 AM | Last Updated on Sun, Apr 16 2023 11:46 AM

Pak Vs NZ: Pakistan Won By 38 Runs Babar Azam Equals Dhoni Eyes On World Record - Sakshi

రవూఫ్‌తో బాబర్‌ ఆజం

Pakistan vs New Zealand, 2nd T20I: న్యూజిలాండ్‌తో రెండో టీ20లో పాకిస్తాన్‌ ఘన విజయం సాధించింది. కివీస్‌పై 38 పరుగులతో గెలుపొంది ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0కు ఆధిక్యాన్ని పెంచుకుంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

సెంచరీతో చెలరేగిన బాబర్‌
ఓపెనర్లలో మహ్మద్‌ రిజ్వాన్‌ 50 పరుగులు సాధించగా.. కెప్టెన్‌ బాబర్‌ ఆజం సెంచరీతో చెలరేగాడు. 58 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 101 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో ఫఖర్‌  జమాన్‌, సయీమ్‌ ఆయుబ్‌ డకౌట్‌ కాగా.. ఇమాద్‌ వాసిం(2) కూడా పూర్తిగా నిరాశపరిచాడు.

ఆఖర్లో ఇఫ్తికర్‌ అహ్మద్‌ 19 బంతుల్లో 33 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి బాబర్‌తో కలిసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి పాకిస్తాన్‌ 192 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

చాప్‌మన్‌ పోరాడినా
మార్క్‌ చాప్‌మన్‌ (65- నాటౌట్‌) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. హారిస్‌ రవూఫ్‌.. విల్‌ యంగ్‌, డారిల్‌ మిచెల్, జేమ్స్‌ నీషమ్‌, రచిన్‌ రవీంద్రలను అవుట్‌ చేసి నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మిగిలిన పాక్‌ బౌలర్లలో ఇమాద్‌ వాసిం, జమాన్‌ ఖాన్‌, షాదాబ్‌ ఖాన్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

ధోని రికార్డు సమం చేసిన బాబర్‌ ఆజం
కివీస్‌తో తొలి టీ20లో ధోని రికార్డు సమం చేశాడు బాబర్‌ ఆజం. అంతర్జాతీయ టీ20లో సారథిగా బాబర్‌కిది 41వ గెలుపు. తద్వారా పొట్టి ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో ధోనితో కలిసి రెండోస్థానంలో నిలిచాడు.

తాజా విజయంతో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, అఫ్గనిస్తాన్‌ మాజీ సారథి అస్గర్‌ స్టానిక్జైలను సమం చేశాడు. 42 విజయాలతో ప్రపంచ రికార్డు అందుకుని సమకాలీనులలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇదిలా ఉంటే కివీస్‌తో సొంతగడ్డపై రెండో మ్యాచ్‌ బాబర్‌ కెరీర్‌లో 100వ అంతర్జాతీయ మ్యాచ్‌, కెప్టెన్‌గా 67వది కావడం విశేషం.

చదవండి: Mike Tyson: 38 సార్లు అరెస్ట్‌! జైలర్‌ చొరవతో ఇలా! వివాహేతర సంబంధాలు.. ఈ ‘హీరో’ విలన్‌ కూడా! కోట్లాది సంపద ఆవిరి.. ఆఖరికి
IPL 2023: మా ఓటమికి కారణం అదే..! అవునా.. ఓర్వలేకే చెత్త కామెంట్లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement