పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. తన ఎంపిక సరైనదేనని చాటుతూ రీఎంట్రీ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. కివీస్‌తో స్వదేశంలో జరుగుతున్న మొదటి టెస్టులో అతను 86 పరుగులు చేశాడు. అయితే క్రీజులో ఉన్నప్పుడు తన గుండె చాలా వేగంగా కొట్టుకుందని అతను అన్నాడు.
''నేను మొదటి మూడు బంతులు ఎదుర్కొన్నప్పుడు నా గుండె ఎంతో వేగంగా కొట్టుకుందంటే.. ఆ సమయంలో నా హార్ట్‌బీట్‌ను కొలిస్తే, ఆ మీటర్ పగిలిపోయి ఉండేదేమో’ అని అతను మ్యాచ్ అనంతరం సరదాగా వ్యాఖ్యానించాడు. ‘నా గుండె చాలా వేగంగా కొట్టుకుంది. ఇదేమి నాకు తొలి టెస్టు మ్యాచ్ కాదు. అయినా సరే ఎందుకో చాలా టెన్షన్‌గా అనిపించింది. బాబర్ మాట్లాడడంతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. నాకు చాలా రోజుల తర్వాత అవకాశం వచ్చింది. నా ఇన్నింగ్స్ జట్టు విజయానికి తోడ్పడుతుందని అనుకుంటున్నా'' అని సర్ఫరాజ్ అన్నాడు.
వికెట్ కీపర్ అయిన సర్ఫరాజ్ దాదాపు నాలుగేళ్ల తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. పాక్ క్రికెట్ బోర్డు మహమ్మద్ రిజ్వాన్ స్థానంలో సర్ఫరాజ్‌ను ఎంపిక చేసింది. కెప్టెన్ బాబర్‌తో కలిసి ఐదో వికెట్‌కు 196 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. పాకిస్థాన్ భారీ స్కోర్‌కు బాటలు వేసిన సర్ఫరాజ్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 153 బంతుల్లో 86 రన్స్ చేసిన అతను ఎజాజ్ పటేల్ వేసిన 86వ ఓవర్‌లో అవుటయ్యాడు. ఇక సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్ తరపున 49 టెస్టులు, 117 వన్డేలు, 61 టి20 మ్యాచ్‌లు ఆడాడు.
చదవండి: సివిల్స్ క్లియర్ చేసిన టీమిండియా క్రికెటర్ ఎవరో తెలుసా?
అంతర్జాతీయ క్రికెట్‌కు సీనియర్ ఆల్‌రౌండర్ గుడ్‌బై
Comments
Please login to add a commentAdd a comment