పాక్‌ స్టార్‌ బౌలర్‌ను కలిసిన విరాట్‌ కోహ్లి.. టీ20 ప్రపంచకప్‌ రిపీట్‌ అవుతుందా? | Virat Kohli meets Haris Rauf ahead of Asia Cup 2023 clash in Pallekele - Sakshi
Sakshi News home page

Asia Cup 2023: పాక్‌ స్టార్‌ బౌలర్‌ను కలిసిన విరాట్‌ కోహ్లి.. టీ20 ప్రపంచకప్‌ రిపీట్‌ అవుతుందా?

Published Sat, Sep 2 2023 8:16 AM | Last Updated on Sat, Sep 2 2023 8:39 AM

Virat Kohli meets Haris Rauf ahead of blockbuster clash in Pallekele, - Sakshi

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు సమయం అసన్నమైది. శనివారం క్యాండీ వేదికగా దాయాదుల పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని భారత్‌ భావిస్తుంటే.. పాకిస్తాన్‌ మాత్రం టీమిండియాను ఓడించి ముందుకు వెళ్లాలని యోచిస్తోంది.

ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు తమ ప్రణాళికలను సిద్దం చేసుకున్నాయి.  2019 ప్రపంచకప్ తర్వాత ఈ రెండు జట్లు వన్డేలో ముఖాముఖి తలపడడం ఇదే తొలిసారి. కాబట్టి ఎవరూ పై చేయి సాధిస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

హారిస్ రవూఫ్‌ను కలిసిన విరాట్‌ కోహ్లి..
ఇక ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు రెండు రోజులు ముందే క్యాండీకి చేరుకున్నాయి. ఈ క్రమంలో ప్రాక్టీస్‌ సందర్భంగా టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి, పాక్‌ పేసర్‌ హారిస్ రవూఫ్‌ కాసేపు ముచ్చటించారు. ఇందకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లి-హారిస్‌ రవూఫ్‌ అంటే అందరికి గుర్తుచ్చేది టీ20 ప్రపంచకప్‌-2022.

ఈ మెగా టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో రవూఫ్‌కు కోహ్లి చుక్కలు చూపించాడు. అతడి వేసిన 19 ఓవర్‌లో వరుసగా రెండు అద్భుతమైన సిక్స్‌లు బాదిన విరాట్‌.. మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశాడు. ముఖ్యంగా అతని తలమీదుగా విరాట్‌ కొట్టిన సిక్సర్‌ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే మరోసారి భారత్‌-పాక్‌ తలపడతుండంతో ప్రపంచకప్‌ను రిపీట్‌ చేయాలని కింగ్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.
చదవండిAsia Cup 2023: పాకిస్తాన్‌తో జాగ్రత్త.. ఒకప్పటిలా లేదు! కొంచెం తేడా జరిగినా చాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement