టీ20 వరల్డ్‌కప్ 2024లో పాక్ గ్రూప్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. గ్రూప్-ఏలో పాక్.. భారత్, యూఎస్‌ఏ చేతుల్లో ఓటమిపాలై సూపర్-8కు అర్హత సాధించలేకపోయింది. పాక్ కంటే మెరుగ్గా రాణించిన ఆతిథ్య దేశం యూఎస్‌ఏ.. భారత్‌తో పాటు సూపర్-8లోకి ప్రవేశించింది.
ప్రస్తుత ప్రపంచకప్‌లో పాక్ పోరాటం ముగిసినా ఆ జట్టు ఇంకా స్వదేశానికి తిరుగు ముఖం పట్టలేదు. మరికొద్ది రోజుల పాటు పాక్ బృందం యూఎస్‌ఏలోనే గడపనున్నట్లు సమాచారం.
A heated argument between Haris Rauf and a fan in the USA. pic.twitter.com/d2vt8guI1m
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 18, 2024
అయితే ఈ మధ్యలో పాక్ పేసర్ హరీస్ రౌఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. భార్యతో కలిసి అమెరికా వీధుల్లో షికారుకు వెళ్లిన రౌఫ్‌పై ఓ అభిమాని మాటల దాడికి దిగాడు. ఇందుకు ప్రతిగా రౌఫ్ సైతం గట్టిగానే స్పందించాడు.
తాను ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ అన్న విషయాన్ని మరిచి అభిమానిపై దాడికి యత్నించాడు. కూడా ఉన్న భార్య వారించినా రౌఫ్ వినలేదు. ఆ అభిమానిపైకి ఒంటికాలితో దూసుకెళ్లాడు. ఈ క్రమంలో అతని చెప్పులు సైతం జారిపోయినా పట్టించుకోలేదు.
ఆ అభిమాని ఏమన్నాడో తెలియదు కానీ.. రౌఫ్ కోపంతో ఊగిపోయాడు. దారిన పోయేవారు.. సెక్యూరిటీ వారిండంతో రౌఫ్ ఆడిపోయాడు. ఈ లోపు రౌఫ్‌ను రెచ్చగొట్టిన అభిమాని అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
అభిమాని పట్ల రౌఫ్ ప్రవర్తన చూసి సొంత దేశ అభిమానులు కూడా అతన్ని అసహ్యించుకుంటున్నారు. రౌఫ్ ప్రొఫెషనల్ క్రికెటర్ అన్న విషయాన్ని మరిచి వీధి రౌడీలా ప్రవర్తించాడని చివాట్లు పెడుతున్నారు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లకు ఇలాంటి అనుభవాలు సహజమేనని.. ఇలాంటి సందర్భాల్లో పరిణితి ప్రదర్శించి చూసీ చూడనట్లు వ్యవహరించాలని హితవు పలుకుతున్నారు.
ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్-8 బెర్త్‌లు ఖరారైన విషయం తెలిసిందే. గ్రూప్-ఏ నుంచి భారత్‌తో (A1) పాటు యూఎస్‌ఏ (A2) సూపర్-8కు అర్హత సాధించింది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1), ఇంగ్లండ్ (B2), గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1), వెస్టిండీస్ (C2), గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1), బంగ్లాదేశ్ (D2) సూపర్-8లోకి ప్రవేశించాయి.
సూపర్-8 గ్రూప్-1లో గ్రూప్-ఏ నుంచి భారత్ (A1).. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1).. గ్రూప్-డి నుంచి బంగ్లాదేశ్ (D2) జట్లు ఉన్నాయి.
సూపర్-8 గ్రూప్ 2లో గ్రూప్-ఏ నుంచి యూఎస్‌ఏ (A2).. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ (B2).. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్ (C2).. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి.
సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్‌లు..
జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)
జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)
జూన్ 22- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)
జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)
జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)
జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (సెయింట్ విన్సెంట్)
సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్‌లు..
జూన్ 19- యూఎస్‌ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)
జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)
జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)
జూన్ 21- యూఎస్‌ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)
జూన్ 23- యూఎస్‌ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)
జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)
Comments
Please login to add a commentAdd a comment