పాక్‌ స్టార్‌ పేసర్‌ ఓవరాక్షన్‌.. అయ్యర్‌పైకి బాల్‌ త్రో! వీడియో వైరల్‌ | Angry Haris Rauf Throws Ball At Shreyas Iyer | Sakshi
Sakshi News home page

ODI WC 2023: పాక్‌ స్టార్‌ పేసర్‌ ఓవరాక్షన్‌.. అయ్యర్‌పైకి బాల్‌ త్రో! వీడియో వైరల్‌

Published Sat, Oct 14 2023 7:35 PM | Last Updated on Sat, Oct 14 2023 7:45 PM

 Angry Haris Rauf Throws Ball At Shreyas Iyer - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ 191 పరుగులకే కుప్పకూలింది.  భారత బౌలర్లలో కుల్దీప్‌, సిరాజ్‌, బుమ్రా, హార్దిక్‌, జడేజా తలా రెండు వికెట్లతో పాక్‌ పతనాన్ని శాసించారు. పాకిస్తాన్‌ బ్యాటర్లలో బాబర్‌ ఆజం(50),మహ్మద్‌ రిజ్వాన్‌(49) టాప్‌ స్కోరర్లగా నిలిచారు.

రవూఫ్‌ ఓవరాక్షన్‌..
ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ పేసర్‌ హ్యారీస్‌ రవూఫ్‌ ఓవరాక్షన్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో రవూఫ్‌కు తన తొలి ఓవర్‌లోనే రోహిత్‌ శర్మ చుక్కలు చూపించాడు. టీమిండియా ఇన్నింగ్స్‌ 9 ఓవర్‌ వేసిన రవూఫ్‌.. తన మొదటి ఓవర్‌లోనే 14 పరుగులు సమర్పించుకున్నాడు.

దీంతో రవూఫ్‌ కాస్త అసహనానికి లోనయ్యాడు. ఈ క్రమంలో తన తదుపరి ఓవర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ ఓ బంతిని బౌలర్‌ దిశగా డిఫెన్స్‌ ఆడాడు. అయితే బంతిని అందుకున్న రవూఫ్‌.. శ్రేయస్‌పై త్రో చేశాడు. దీంతో ఒక్కసారిగా అయ్యర్‌ పక్కకు తప్పుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: #Virat Kohli: రిజ్వాన్‌ ‘ఓవరాక్షన్‌’కు కోహ్లి రియాక్షన్‌ అదిరింది! ఇంకెంత సేపు.. చాలుగానీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement