
ఆసియాకప్-2023లో పాకిస్తాన్ పేసర్లు మరోసారి నిప్పులు చేరిగారు. ఈ మెగా టోర్నీ సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ పేస్ త్రయం అఫ్రిది, హారీస్ రౌఫ్, నసీం షా చుక్కలు చూపించారు. వీరిముగ్గురు దాటికి బంగ్లాదేశ్ 38.4 ఓవర్లలో 193 పరగులకే కుప్పకూలింది.
హారీస్ రౌఫ్, నసీం షా తలా మూడు వికెట్లతో బంగ్లాను దెబ్బతీయగా.. అఫ్రిది, ఇఫ్తికర్ అహ్మద్, అష్రఫ్ చెరో వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో ముష్ఫికర్ రహీమ్(64) పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ షకీబ్ అల్‌హసన్(53) పరుగులతో రాణించాడు. కాగా అంతకుముందు ఈ పేస్ త్రయం భారత్‌తో మ్యాచ్‌లో కూడా అదరగొట్టిన సంగతి తెలిసిందే.
చదవండి: WC 2023: జింబాబ్వేపై ఆడాడని వరల్డ్‌కప్‌కు సెలక్ట్ చేశారా? జట్టులో దండుగ అతడు
Comments
Please login to add a commentAdd a comment