భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎంతో అతృతగా ఎదురుచూసిన అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లింది. ఆసియాకప్-2023లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత భారీ వర్షం కురవడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ మొదలవ్వలేదు. ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్‌ని రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.
ఇరు జట్లకి చెరో పాయింట్ దక్కింది. దీంతో సూపర్-4కు గ్రూపు-ఏ నుంచి పాకిస్తాన్ అర్హత సాధించింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 66 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అదుకున్నారు.
వీరిద్దరూ ఐదో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. కిషన్ 82 పరుగులు చేయగా.. హార్దిక్ 87 పరుగులతో అదరగొట్టాడు. పాక్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. హారీస్ రవూఫ్, నషీం షా తలా మూడు వికెట్లు సాధించారు.
హారీస్ రవూఫ్ ఓవరాక్షన్..
ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ స్టార్ పేసర్ హారీస్ రవూఫ్ ఓవరాక్షన్ చేశాడు. ఇషాన్ కిషన్‌న్‌ను ఔట్ చేసిన తర్వాత రౌఫ్ చేసిన సెలబ్రేషన్స్ శృతి మించాయి. భారత ఇన్నింగ్స్ 38వ ఓవర్ వేసిన రవూఫ్ బౌలింగ్‌లో కిషన్ భారీ షాట్‌కు ప్రయత్నించి బాబర్‌కు క్యాచి ఇచ్చి ఔటయ్యాడు. వెంటనే రవూఫ్.. కిషన్ వైపు వేలు చూపిస్తూ ఇక చాలు వెళ్లు వెళ్లు అంటూ సైగలు చేశాడు.
అయితే కిషన్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకుపోయినప్పటికీ.. మరో ఎండ్‌లో ఉన్న హార్దిక్ మాత్రం సీరియస్‌గా తీసుకున్నాడు. రవూఫ్ వేసిన తర్వాతి ఓవర్‌లో వరుసగా 3 ఫోర్లు బాది బ్యాట్‌తో సమాధానమిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
— Nihari Korma (@NihariVsKorma) September 3, 2023
Comments
Please login to add a commentAdd a comment