Netherlands Announced Name 15-Member Squad For Pakistan ODIs - Sakshi
Sakshi News home page

NED vs PAK: పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌.. జట్టును ప్రకటించిన నెదర్లాండ్స్!

Published Sun, Aug 14 2022 9:02 AM | Last Updated on Sun, Aug 14 2022 11:27 AM

Netherlands name 15 member squad for Pakistan ODIs - Sakshi

స్వదేశంలో పాకిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును నెదర్లాండ్స్ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు స్కాట్ ఎడ్వర్డ్స్ నాయకత్వం వహించనున్నాడు. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్‌ టోర్నీలు ది హండ్రెడ్,  రాయల్‌ వన్డే కప్‌లో భాగమైన ఏడుగురు నెదర్లాండ్స్ ఆటగాళ్లు ఈ సిరీస్‌కు దూరమయ్యారు.

వారిలో కోలిన్ అకెర్మాన్, ఫ్రెడ్ క్లాసెన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, టిమ్ వాన్ డెర్ గుగ్టెన్, షేన్ స్నేటర్, బ్రాండన్ గ్లోవర్, పాల్ వాన్ మీకెరెన్ ఉన్నారు. మరోవైపు వెటరన్ ఆల్ రౌండర్ వెస్లీ బరేసి ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. అదే విధంగా యువ ఆటగాడు ఆర్నవ్ జైన్ నెదర్లాండ్స్ తరపున అరంగేట్రం చేయనున్నాడు.

ఇక నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా పాకిస్తాన్‌ మూడు వన్డేలు ఆడనుంది. రోటర్డ్యామ్ వేదికగా ఆగష్టు 16న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే ఈ సిరీస్‌కోసం పాకిస్తాన్‌ తమ జట్టును ప్రకటిచింది.

నెదర్లాండ్స్ జట్టు: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్‌), మాక్స్ ఓ డౌడ్, విక్రమ్ సింగ్, మూసా నదీమ్ అహ్మద్, టామ్ కూపర్, బాస్ డి లీడే, వెస్లీ బరేసి, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, టిమ్ ప్రింగిల్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లైన్, వివియన్ కింగ్మా, షరీజ్ అహ్మద్, అర్నవ్ జైన్

పాకిస్థాన్ జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్‌), షాదాబ్ ఖాన్, అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, ఇమామ్-ఉల్-హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, సల్మాన్ అలీ అఘా షాహీన్ షా ఆఫ్రిది, షానవాజ్ దహానీ, జాహిద్ మహమూద్
చదవండి: డకౌట్ అయ్యానని ఆ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ నా చెంపపై కొట్టాడు: టేలర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement