న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో పాల్గొనే పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఎట్టకేలకు వీసా సమస్య తీరింది. సోమవారం సాయంత్రం జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి భారత వీసాలు మంజూరైనట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ధారించింది. పాక్ బృందానికి వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించింది.
48 గంటల్లో భారతదేశానికి బయల్దేరాల్సి ఉన్నా... ఇంకా తమకు వీసాలు రాకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ అసంతృప్తిని వెల్లడించింది. సోమవారం ఉదయం ఈ విషయంపై పాక్ బోర్డు ఐసీసీకి లేఖ రాసింది. చివరకు సాయంత్రానికి పరిస్థితి చక్కబడింది.
వరల్డ్ కప్‌కు ముందు దుబాయ్‌లో రెండు రోజుల పాటు తమ జట్టుకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయాలని భావించిన పాక్ వీసా సమస్య కారణంగా దానిని రద్దు చేసుకుంది. ఇప్పుడు తాజా షెడ్యూల్ ప్రకారం బుధవారం తెల్లవారుజామున లాహోర్ నుంచి బయల్దేరే పాక్ టీమ్ దుబాయ్ మీదుగా సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటుంది. శుక్రవారం ఆ జట్టు ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో తొలి వామప్ మ్యాచ్ ఆడుతుంది.
చదవండి: IND VS AUS 3rd ODI: టీమిండియాకు భారీ షాక్
Comments
Please login to add a commentAdd a comment