బాబర్‌ ఆజంకు జరిమానా విధించిన పోలీసులు.. ఎందుకంటే? | Over Speeding Creates Problem For Pak Skipper, Babar Azam Receiving Traffic Challan In Lahore Pic Viral - Sakshi
Sakshi News home page

Babar Azam Traffic Challan Pic: బాబర్‌ ఆజంకు జరిమానా విధించిన పోలీసులు.. ఎందుకంటే?

Published Tue, Sep 26 2023 10:24 AM | Last Updated on Tue, Oct 3 2023 7:38 PM

Over Speeding Creates Problem For Pakistan Skipper - Sakshi

అతి వేగంతో కారు నడిపినందుకు పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంకు పోలీసులు జరిమానా విధించారు. టైమ్స్ ఆఫ్ కరాచీ నివేదిక ప్రకారం..  పంజాబ్ హైవేలో తన ఆడి కారును పరిమితికి మించిన వేగంతో నడిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడి వేగాన్ని గమనించిన పంజాబ్ మోటర్‌వే పోలీసులు కారును ఆపి ఫైన్‌ వేసినట్లు సమాచారం.

అయితే ఎంత జరిమానా విధించారన్న విషయం మాత్రం బయటకు రాలేదు. కాగా ట్రాఫిక్ పోలీసులకు చిక్కడం బాబర్‌కు ఇదేం కొత్త కాదు. గతంలో తన కారుకు సరైన నెంబర్ ప్లేటు లేకుండా బాబర్ డ్రైవ్ చేస్తూ దొరికిపోయాడు.

ఇక వరల్డ్‌కప్‌-2023లో పాల్గోనేందుకు పాకిస్తాన్‌ జట్టుకు మార్గం సుగమైంది. పాక్‌ జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం సోమవారం ఆమోదముద్ర వేసింది. దీంతో బుధవారం తెల్లవారుజామున లాహోర్‌ నుంచి బయల్దేరే పాక్‌ టీమ్‌ దుబాయ్‌ మీదుగా సాయంత్రానికి హైదరాబాద్‌ చేరుకుంటుంది. శుక్రవారం ఆ జట్టు ఉప్పల్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో తొలి వామప్‌ మ్యాచ్‌ ఆడుతుంది.

వరల్డ్‌కప్‌కు పాకిస్తాన్‌ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్‌), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, సల్మాన్ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వాస్ జూనియర్
చదవండి: World Cup 2023: భారత్‌ను ఓడించిన జట్టు వరల్డ్‌కప్‌ గెలుస్తుంది.. మా జట్టుకు దిష్టి పెట్టకు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement