indian visa
-
వీసా కష్టం.. పైసా నష్టం..
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యార్జన, ఉజ్వల భవిష్యత్తు కోసం, ఇతర కారణాలతో విదేశాలకు వెళ్లేవారు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోగా.. మరోవైపు వీసా తిరస్కరణ (Visa Reject) బాధితుల సంఖ్యా ఎక్కువగానే పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి వీసాలూ అధిక సంఖ్యలోనే తిరస్కరణకు గురవుతున్నాయి. దేశవ్యాప్తంగా వీసాల తిరస్కరణ కారణంగా గత ఏడాదిలో నష్టపోయిన మొత్తం రూ.660 కోట్ల పైమాటేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. పర్యాటకులను స్వాగతించే దేశంగా పేరున్న యూఏఈ వీసాలు పొందడంలో సైతం ఎదుర్కొన్న ఇబ్బందులను చాలామంది గత ఏడాది చివరిలో సోషల్ మీడియా (Social Media) వేదికగా పంచుకున్నారు.జనవరి నుంచి అక్టోబర్ 2024 మధ్యకాలంలో 24.8% మంది భారతీయలు (Indians) యూఏఈని సందర్శించారు. భారతీయ పర్యాటకులకు అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఒకటిగా యూఏఈ (UAE) ఉంది. అయితే కొంతకాలం క్రితం దుబాయ్ ఇమ్మిగేషన్ విభాగం ప్రవేశపెట్టిన కఠినమైన నిబంధనల కారణంగా భారీ స్థాయిలో వీసాలు తిరస్కరణలకు గురయ్యాయి. కోవిడ్ అనంతరం ఇతర అనేక దేశాలు కూడా తమ వీసా నిబంధనలను సవరించాయి. ఈ నేపథ్యంలో వీసాల తిరస్కరణ కారణంగా గత ఏడాది భారతీయులు రూ.664 కోట్లను నష్టపోయారని గణాంకాలు చెబుతున్నాయి. తిలా పాపం తలా పిడికెడువీసా నిబంధనలు కఠినతరం చేసిన దేశాలలో యూఏఈతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే ప్రధానంగా ఉన్నాయి. గత ఏడాది న్యూజిలాండ్ 32.5 శాతం భారతీయ వీసా (Indian Visa) దరఖాస్తులను తిరస్కరించింది, ఆస్ట్రేలియా 29.3 శాతం, యూకే 17 శాతం మందిని తిరస్కరించాయి. స్కెంజెన్ ఏరియా (యూరప్) 15.7 శాతం వీసాల్ని తిరస్కరించింది. యూఏఈ భారతీయ వీసాల తిరస్కరణ రేటు గత ఏడాది 6 శాతానికి చేరుకుంది. అయితే 2019లో వీసా ఆమోదం రేట్లతో పోల్చనప్పుడు. 2024లో భారతీయుల కోసం అధిక శాతం వీసాలను ఆమోదించిన దేశంగా అమెరికా నిలిచింది. 2019లో 28 శాతం భారతీయ వీసా దరఖాస్తులను యూఎస్ తిరస్కరించగా, 2024లోకి వచ్చేసరికి ఇది 16 శాతానికి తగ్గింది. అయితే అమెరికా వెళ్లేందుకు మనవారి వీసా దరఖాస్తుల సంఖ్య పరంగా చూస్తే ఈ 16 శాతం కూడా ఎక్కువేనని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ తర్వాత కఠినంగా..ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, యూఏఈ వంటి దేశాలు వీసా నిబంధనలను కఠినతరం చేయడం అనేది..కరోనా మహమ్మారి అనంతరం ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన వీసా దరఖాస్తుల సూక్ష్మస్థాయి పరిశీలన, ఎంపిక ధోరణిని ప్రతిబింబిస్తోంది. వీసాల తిరస్కరణ రేటు పెరుగుదల భారతీయ ప్రయాణీకులను ఆందోళనకు గురిచేస్తోంది. దరఖాస్తుదారులు.. తమకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు సరిగ్గానే ఉన్నాయని, తమ దరఖాస్తులు పూర్తి దోష రహితంగా ఉన్నాయని నిర్ధారించుకోవాల్సిన ఆవశ్యకతను ఈ పరిస్థితి స్పష్టం చేస్తోంది.సర్వ సాధారణంగా మారిన తిరస్కరణలు‘ఎంఫార్మ్ కోసం అమెరికా వీసాకు దరఖాస్తు చేస్తే రెండుసార్లు తిరస్కరణకు గురైంది. మరోసారి అప్లయ్ చేయబోతున్నా. ఇప్పటివరకు రూ.42 వేలు ఖర్చయ్యింది. నా స్నేహితుడు ఒకరికి 10 సార్లు వీసా నిరాకరించారు..’అని పంజాగుట్ట నివాసి ప్రవీణ్ చెప్పాడు. ఇక రెండుసార్లు, మూడుసార్లు వీసా తిరస్కరణలకు గురి కావడమనేది సర్వసాధారణంగా మారుతోంది. యూకేకి రూ.12 వేలు మొదలుకుని రూ.లక్ష పైగా వీసా దరఖాస్తు ఫీజులు ఉన్నాయి. అలాగే ఆ్రస్టేలియాకు రూ.4 వేల నుంచి రూ.60 వేలు వరకూ, న్యూజిలాండ్‌కు రూ.11 వేల నుంచి రూ.1.15లక్షల వరకూ, యూఏఈకి రూ.8 వేల నుంచి రూ.35 వేలు ఆపైన ఉన్నాయి.చదవండి: ఆర్జీకర్ ఘటన అందుకే ‘అరుదైన కేసు’ కాలేకపోయింది!అమెరికాకు రూ.20 వేల వరకూ వీసా ఫీజులు ఉన్నాయి. అయితే వెళ్లే కారణాన్ని బట్టి, వీసా పొందడానికి ఎంచుకున్న విధానాన్ని బట్టి ఈ ఫీజులు ఇంతకంటే పెరగవచ్చు కూడా. ‘మా అబ్బాయి అమెరికా వీసాకి మొదటిసారి రూ.70 వేల దాకా పెట్టిన ఖర్చు వృథా అయ్యింది. రెండవసారి దాదాపు అంతే ఖర్చు పెట్టి వీసా తెచ్చుకున్నాం..’ అని మల్కాజిగిరికి చెందిన లక్ష్మి చెప్పారు. మొత్తంగా చూస్తే వీసా తిరస్కరణల కారణంగా పెద్ద మొత్తంలోనే నష్టం జరుగుతోందనేది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో వీసా నిబంధనలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని, డాక్యుమెంట్లన్నీ పూర్తి కచ్చితత్వంతో ఉండేలా చూసుకున్న తర్వాతే దరఖాస్తు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. -
పాక్ మూలాలు ఉన్న ఇంగ్లండ్ స్పిన్నర్‌కు ఎట్టకేలకు భారత వీసా
భారత వీసా లభించకపోవడంతో తొలి టెస్టుకు దూరమైన ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు ఊరట లభించింది. వీసా లేకపోవడంతో అతను జట్టుతో పాటు భారత్‌కు ప్రయాణించకుండా యూఏఈ నుంచి ఇంగ్లండ్‌కు వెనక్కి వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు బషీర్‌కు వీసా మంజూరైందని గురువారం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. ‘బషీర్ తన వీసా అందుకున్నాడు. ఈ వారాంతంలో భారత్‌కు వచ్చి అతను జట్టుతో కలుస్తాడు. సమస్య పరిష్కారం కావడంతో సంతోషంగా ఉంది’ అని ఈసీబీ వెల్లడించింది. ఇంగ్లండ్‌లో పుట్టినా... పాకిస్తాన్ మూలాలు ఉన్న కారణంగానే బషీర్ వీసాను భారత ప్రభుత్వం ఆలస్యం చేసిందని గత రెండు రోజులుగా విమర్శలు వచ్చాయి. ఇంగ్లండ్ ప్రభుత్వ అధికారి కూడా ఒకరు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేయగా... ఇప్పుడు అంతా సుఖాంతమైంది. 20 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ బషీర్ ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు. ఒకవేళ బషీర్ జట్టుతో పాటు భారత్‌కు చేరుకుని ఉంటే ఇంగ్లండ్ తుది జట్టులో అతను ఉండేవాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును నిన్ననే ప్రకటించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. రెహన్ అహ్మద్, జాక్ లీచ్, టామ్ హర్ట్లీలతో కూడిన ఇంగ్లండ్ స్పిన్ త్రయం భారత బ్యాటర్లను ఢీ కొట్టనుంది. భారత్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్ -
అమెరికాలోనే హెచ్–1బీ వీసాల రెన్యూవల్
వాషింగ్టన్: అమెరికాలో హెచ్–1బీ వీసాలతో ఉద్యోగాలు చేసుకుంటున్న విదేశీయులకు అమెరికా స్టేట్ ఫర్ వీసా సరీ్వసెస్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీ జూలీ స్టఫ్ట్ శుభవార్త చెప్పారు. హెచ్–1బీ వీసాల రెన్యూవల్ (స్టాంపింగ్) కోసం స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం లేదని, అమెరికాలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. డిసెంబర్ నుంచి మూడు నెలలపాటు ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. కొన్ని కేటగిరీల్లో హెచ్–1బీ వీసాలకు డొమెస్టిక్ రెన్యూవల్ ప్రక్రియ డిసెంబర్ నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. అమెరికాలో పెద్ద సంఖ్యలో భారత ఐటీ నిపుణులు హెచ్–1బీ వీసాలతో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తాజా నిర్ణయంతో వీరికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. వ్యయ ప్రయాసలు తప్పుతాయి. అయితే, తొలి దశలో 20,000 మందికే ఈ వెసులుబాటు కలి్పంచనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత దశల వారీగా మరికొంతమందికి అవకాశం కలి్పస్తారు. డిసెంబర్ నుంచి మూడు నెలల్లోగా హెచ్–1బీ వీసా గడువు ముగిసేవారు వీసా రెన్యూవల్ (స్టాంపింగ్)ను అమెరికాలోనే చేసుకోవచ్చు. అమెరికా వీసాలకు భారత్‌లో భారీ డిమాండ్ ఉందని జూలీ స్టఫ్ట్ గుర్తుచేశారు. వీసా కోసం కొన్ని సందర్భాల్లో ఏడాదిపాటు ఎదురుచూడాల్సి వస్తోందని చెప్పారు. భారతీయులకు సాధ్యమైనంత త్వరగా వీసా అపాయింట్మెంట్లు ఇవ్వాలని భావిస్తున్నామని వివరించారు. ఇందులో ఒక మార్గంగా డొమెస్టిక్ వీసా రెన్యూవల్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. దీనివల్ల భారతీయ టెకీలకు లబ్ధి కలుగుతుందన్నారు మనవారికి 1.4 లక్షల వీసాలు 2022లో భారత విద్యార్థులకు రికార్డు స్థాయిలో 1.4 లక్షలకుపైగా వీసాలు జారీ చేసినట్లు స్టఫ్ట్ వెల్లడించారు. అమెరికా వర్సిటీల్లో తరగతుల ప్రారంభానికి ముందే భారత్‌లో స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు పూర్తి చేయడానికి సిబ్బంది కొన్నిసార్లు వారమంతా పనిచేస్తున్నారని తెలిపారు. -
‘వీసా’ వచ్చేసింది... రేపు హైదరాబాద్‌కు పాకిస్తాన్ జట్టు
న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో పాల్గొనే పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఎట్టకేలకు వీసా సమస్య తీరింది. సోమవారం సాయంత్రం జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి భారత వీసాలు మంజూరైనట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ధారించింది. పాక్ బృందానికి వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించింది. 48 గంటల్లో భారతదేశానికి బయల్దేరాల్సి ఉన్నా... ఇంకా తమకు వీసాలు రాకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ అసంతృప్తిని వెల్లడించింది. సోమవారం ఉదయం ఈ విషయంపై పాక్ బోర్డు ఐసీసీకి లేఖ రాసింది. చివరకు సాయంత్రానికి పరిస్థితి చక్కబడింది. వరల్డ్ కప్‌కు ముందు దుబాయ్‌లో రెండు రోజుల పాటు తమ జట్టుకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయాలని భావించిన పాక్ వీసా సమస్య కారణంగా దానిని రద్దు చేసుకుంది. ఇప్పుడు తాజా షెడ్యూల్ ప్రకారం బుధవారం తెల్లవారుజామున లాహోర్ నుంచి బయల్దేరే పాక్ టీమ్ దుబాయ్ మీదుగా సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటుంది. శుక్రవారం ఆ జట్టు ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో తొలి వామప్ మ్యాచ్ ఆడుతుంది. చదవండి: IND VS AUS 3rd ODI: టీమిండియాకు భారీ షాక్ -
సుష్మాకు సూపర్ ఉమన్ ట్వీట్ల వర్షం
భారతదేశం అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఇక్కడకు రావాలని చాలా ప్రయత్నించింది. కానీ టొరంటోలోని భారత రాయబార కార్యాలయం నుంచి వీసా పొందాలంటే ఆమెకు చుక్కలు కనిపించాయి. సాధారణంగా యూట్యూబ్‌లో తనదైన శైలిలో వీడియోలు పెడుతూ అందరినీ తెగ నవ్వించే లిల్లీ సింగ్.. అలియాస్ సూపర్ ఉమన్ ఈసారి ట్విట్టర్ ద్వారా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను సంప్రదించింది. తన కష్టాలు తీర్చమని, టొరంటో ఎంబసీ విషయం చూడాలని కోరింది. మధ్యలోప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా తన ట్వీట్లలో ట్యాగ్ చేసింది. టొరంటోలోని రాయబార కార్యాలయంలో వీసా పొందడం చాలా కష్టంగా ఉందని, అసలు ఏమాత్రం ప్రొఫెషనల్‌గా లేదని తెలిపింది. తాను వీసా పొందడానికి అక్కడకు ఎన్నిసార్లు వెళ్లానో, ఎన్ని కష్టాలు పడ్డానో చూడండంటూ ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. అక్కడి ఉద్యోగులు చాలా తలబిరుసుగా ఉన్నారని, కేవలం ఒక్క ప్రశ్న అడిగినందుకు తన మీద పలు సందర్భాల్లో మండిపడ్డారని తెలిపింది. ఆ తర్వాత ఆమెకు వీసా అయితే వచ్చింది. కానీ తాను ఒక ఏడాది పాటు వీసా కావాలని దరఖాస్తు చేస్తే.. కేవలం మూడు నెలలకు మాత్రమే ఇచ్చారని వాపోయింది. అక్కడున్న వారిలో ఒక్క ఉద్యోగి మాత్రం చాలా స్నేహ పూర్వకంగా ఉన్నారని, తాను ఇంటర్నెట్ సెలబ్రిటీ అని తెలిసిన తర్వాత తనతో కలిసి ఒక ఫొటో కూడా తీసుకున్నారని లిల్లీసింగ్ చెప్పింది. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ఆమెకు సమాధానం అయితే ఇవ్వలేదు గానీ, మొత్తానికి మూడు నెలలకైనా వీసా మాత్రం ఆమె చేతికి వచ్చేసింది కాబట్టి ఎంచక్కా భారతదేశం రావచ్చు. ఇక్కడ అవకాశం ఉంటే అపాయింట్మెంట్ తీసుకుని సుష్మా స్వరాజ్‌ను కూడా కలవచ్చు. తాను తొలిసారిగా రాసిన ‘హౌ టు బీ ఎ బాస్: ఎ గైడ్ టు కాన్కరింగ్ లైఫ్’ అనే పుస్తకం ప్రమోషన్ కోసం ఆమె ఈ నెలాఖరులో భారతదేశానికి రానుంది. Love india but gotta say that the consulate of india in Toronto is literally the worst place on earth. Such a disappointment. — Lilly | #BawseBook (@IISuperwomanII) 6 April 2017 For travel to India, the consulate makes acquiring a visa the most difficult task. I hope one day @narendramodi can remedy this. It's sad. — Lilly | #BawseBook (@IISuperwomanII) 6 April 2017 .@SushmaSwaraj just a kind note to make you aware that the Consulate of India in Toronto is extremely difficult and unprofessional.