వెంటాడుతున్న ప్రపంచ కప్ వైఫల్యం | Afridi, Shehzad, Akmal dropped from Pakistan squad | Sakshi
Sakshi News home page

వెంటాడుతున్న ప్రపంచ కప్ వైఫల్యం

Published Mon, May 2 2016 8:28 PM | Last Updated on Wed, Jul 25 2018 1:57 PM

వెంటాడుతున్న ప్రపంచ కప్ వైఫల్యం - Sakshi

వెంటాడుతున్న ప్రపంచ కప్ వైఫల్యం

లాహోర్: టి-20 ప్రపంచ కప్లో విఫలమైన పాకిస్తాన్ క్రికెటర్లు షాహిద్ అఫ్రిదీ, అహ్మద్ షెహజాద్, ఉమర్ అక్మల్కు నిరాశ ఎదురైంది. వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే పాక్ జట్టులో ఈ ముగ్గురికి ఆడే అవకాశం దక్కలేదు.

ఇంజమామ్ ఉల్ హక్ సారథ్యంలోని పాక్ సెలెక్షన్ కమిటీ ఇంగ్లండ్ టూర్కు 35 ఆటగాళ్లతో ప్రాబబుల్స్ జాబితాను ఎంపిక చేసింది. వీరికి ఈ నెల 14 నుంచి జూన్ 4 వరకు ఖైబర్-పాక్టుంక్వా ప్రావిన్స్లో శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. టి-20 ప్రపంచ కప్లో విఫలమైనందుకు అఫ్రిదీపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అహ్మద్ షెహజాద్, ఉమర్ అక్మల్ పేలవ ప్రదర్శనతో పాటు క్రమశిక్షణ చర్యల కింద వారిపై వేటు వేశారు. ఇంగ్లండ్ పర్యటనలో పాక్ నాలుగు టెస్టులు, ఐదు వన్డేలు, ఓ టి-20 మ్యాచ్ ఆడనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement