![Pakistan Team Reached England For The Test And T20 Series - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/30/Pak.jpg.webp?itok=-0rKisjx)
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు, మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ కోసం బయల్దేరిన పాకిస్తాన్ జట్టు ఆదివారం రాత్రి ఇంగ్లండ్‌కు చేరుకుంది. ప్రత్యేక విమానంలో లాహోర్ నుంచి మాంచెస్టర్‌కు చేరుకున్న 31 మంది సభ్యులతో కూడిన పాకిస్తాన్ బృందం వొస్టర్‌షైర్‌లో 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండనుంది. ఈ మేరకు ఇంగ్లండ్ బోర్డు ఏర్పాట్లు చేసింది. క్వారంటైన్ తర్వాత ఆటగాళ్లకు మరో సారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం సిరీస్ సన్నాహాల కోసం జూలై 13న పాక్ బృందం డెర్బీషైర్‌కు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment