ప్పల్ స్టేడియం వేదికగా పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌కు అంతా సిద్దమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ సన్నహాక మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులకు బీసీసీఐ అనుమతి నిరాకరిచింది. ప్రేక్షకులు లేకుండానే ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు జట్టు ఇప్పటికే హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టాయి.
బుధవారం పాక్, న్యూజిలాండ్ జట్లు భాగ్యనగరానికి చేరుకున్నాయి. అనంతరం గురువారం(సెప్టెంబర్28)న ఇరు జట్లు నెట్‌ప్రాక్టీస్‌లో కూడా పాల్గోనున్నాయి. కాగా ప్రస్తుత పాక్ జట్టులో మహ్మద్ నవాజ్, ఆగా సల్మాన్ మినహా మిగితా ఆటగాళ్లకు ఎవరికి భారత పిచ్‌లపై ఆడిన అనుభవం లేదు. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు ఎలా రాణిస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు.
మరోవైపు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌తో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2023 సందర్భంగా గాయపడిన కేన్‌మామ అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. అదే విధంగా గాయంతో ఇంగ్లండ్ సిరీస్‌లో మధ్యలో ఇంటిముఖం పట్టిన స్టార్ పేసర్ టిమ్ సౌథీ కూడా ఫిట్‌నెస్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతడు కూడా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.
పాక్ జట్టుకు ఘన స్వాగతం..
ఇక 7 ఏళ్ల తర్వాత భారత గడ్డపై పెట్టిన పాక్ క్రికెట్ జట్టుకు ఘన స్వాగతం లభించింది. అభిమానుల ఆదరణకుపాకిస్తాన్ క్రికెటర్లు ఫిదా అయిపోయారు. పాక్ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా తమ కృతజ్ఞతలను తెలిపారు. హైదరాబాదీ అభిమానులు చూపిస్తున్న ఆదరణ, అభిమానం ఆనందాన్ని కలిగిస్తోందని పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.
మాకు హైదరబాదీల నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. చాలా బాగుంది. భారత్‌లో గడిపే రానున్న నెలన్నర రోజుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మరో పాక్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ ఓ పోస్ట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment