![Pak Cricketer Asif Ali-Wife Blessed Baby Girl 1st Daughter Died 2Y Before - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/19/Asif.jpg.webp?itok=E7vYnuBb)
పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఆసిఫ్ అలీ ఇంట్లో సంతోషం వెల్లివెరిసింది. ఆసిఫ్ రెండోసారి తండ్రిగా ప్రమోషన్ సాధించాడు. గురువారం ఆసిఫ్ అలీ భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆసిఫ్ ట్విటర్ వేదికగా.. తన చిట్టితల్లి వేసుకోబోయే వస్తువులను షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ''నా ఇంట్లోకి చిన్న దేవదూత అడుగుపెట్టింది.. వెల్‌కమ్ టూ వరల్డ్ స్వీట్‌హార్ట్'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో లేటు వయసులో ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆసిఫ్ అలీ పాకిస్తాన్ జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. 2018లో అరంగేట్రం చేసిన ఆసిఫ్ అలీ ఇప్పటివరకు 21 వన్డేల్లో 382 పరుగులు, 39 టి20ల్లో 435 పరుగులు సాధించాడు.
రెండేళ్ల క్రితం మొదటి కూతురు మరణం..
ఆసిఫ్ అలీ ఇంట్లో రెండేళ్ల క్రితం విషాదం చోటుచేసుకుంది. తన రెండేళ్ల కూతురు నూర్ ఫాతిమా క్యాన్సర్ స్టేజీ-4తో పోరాడుతూ కన్నుమూసింది. మే 2019లో అమెరికాలో నూర్ ఫాతిమాకు చికిత్స అందించినప్పటికి వైద్యులు బతికించలేకపోయారు. కూతురు పోయిన బాధను దిగమింగుకొని ఆ ఏడాది పీఎస్‌ఎల్ 2019లో ఆసిఫ్ అలీ అద్బుత ప్రదర్శన నమోదు చేశాడు. కాగా రెండేళ్ల తర్వాత ఆసిఫ్ అలీ దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వడంతో నూర్ ఫాతిమా మళ్లీ పుట్టిందంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు.
Mere Ghar Ayee Aik Nanhi Pari!💓
— Asif Ali (@AasifAli45) May 19, 2022
Welcome to the World, Sweetheart!#blessed #blessedwithababygirl pic.twitter.com/R2dTGQ3gyk
Comments
Please login to add a commentAdd a comment