వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లను ముగించుకుంది. టెస్టు సిరీస్‌ను 1-0తో నెగ్గిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఇప్పుడు టి20 సిరీస్‌పై కన్నేసింది. రోహిత్ శర్మ, కోహ్లి, జడేజాలు ఈ సిరీస్‌కు దూరంగా ఉండడంతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ జట్టు విండీస్‌తో తొలి టి20లో తలపడనుంది.
ఐపీఎల్‌లో ఇరగదీసిన యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, సంజూ శాంసన్‌లు విండీస్‌తో టి20 సిరీస్‌లో రాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే జైశ్వాల్ విండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇక గిల్, ఇషాన్ కిషన్‌లు వన్డే సిరీస్‌లో అద్బుతంగా ఆడారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ హ్యాట్రిక్ అర్థసెంచరీలతో మెరిశాడు. దీంతో ఈ ముగ్గురు తుది జట్టులో ఉండే అవకాశముంది. ఇక మిడిలార్డర్‌లో సంజూ శాంసన్ ఉంటాడా లేదా అనేది చూడాలి. ఇక ఫినిషర్స్‌గా సూర్యకుమార్, హార్దిక్ పాండ్యాలు తమ వంతు పాత్ర పోషించనున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా విండీస్‌తో తొలి టి20 మ్యాచ్ ద్వారా ఒక అరుదైన ఘనత సాధించనుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. టి20 క్రికెట్ చరిత్రలో 200 మ్యాచ్‌లు ఆడిన రెండో జట్టుగా టీమిండియా నిలవనుంది. ఇంతకముందు పాకిస్తాన్ మాత్రమే ఈ మార్క్‌ను దాటింది.
ఓవరాల్‌గా పాకిస్తాన్ 223 టి20 మ్యాచ్‌లు ఆడింది. దీంతో తొలి టి20 మొదలవ్వగానే ఫలితంతో సంబంధం లేకుండా టీమిండియా ఈ రికార్డును అందుకోనుండడం విశేషం. కాగా ఇప్పటివరకు 199 టి20 మ్యాచ్‌లాడిన టీమిండియా 127 విజయాలు, 63 ఓటములు చవిచూసింది. ఒక మ్యాచ్ మాత్రం టైగా ముగిసింది.
చదవండి: Lionel Messi: ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే..
Ishan- Gill: వెటరన్ జోడీ రికార్డు బద్దలు కొట్టిన ఇషాన్- గిల్!
Comments
Please login to add a commentAdd a comment